మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) ‘సీతారామం(Sitaramam)’ సినిమాతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఈ మూవీ అన్ని భాషల్లో ఘన విజయం సాధించడంతో పాటు సినీ ప్రియులను మంత్రముగ్ధులను చేసింది. ప్రస్తుతం అతడు సెల్వమణి సెల్వరాజ్(Selvamani Selvaraj) డైరెక్షన్లో ‘కాంత’ (Kaantha)మూవీ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాను 1950 మద్రాసులో జరిగిన ఒక ఉత్కంఠభరిమైన నాటకీయ థ్రిల్లర్(Dramatic thriller)గా తెరకెక్కిస్తున్నారు. దీనిని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్‌లో ఒకరైన సురేష్ ప్రొడక్షన్స్, వేఫారేర్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రానా దగ్గుబాటి నిర్మిస్తున్నారు.
సెప్టెంబర్ 5న గ్రాండ్ రిలీజ్
ఇందులో దుల్కర్ సల్మాన్ సరసన యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse) హీరోయిన్‌గా నటిస్తుండగా.. స్టార్ యాక్టర్ సముద్రఖని(Samudrakani) కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఇందులోంచి వచ్చిన అప్డేట్స్ అన్ని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ సినిమా రిలీజ్ డేట్(Release Date) ఫిక్స్ చేసుకున్నట్లు సోషల్ మీడియా(SM)లో పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. దీంతో దుల్కర్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
#Kaantha Team Planning to release the movie on SEPT 5th 👀#DulquerSalmaan pic.twitter.com/LWbdIZq6Bk
— Movie Tamil (@MovieTamil4) June 29, 2025






