Mana Enadu : ఆంధ్రప్రదేశ్లో భూప్రకంపనలు (Earthquake) మరోసారి కలకలం రేపుతున్నాయి. ప్రకాశం జిల్లాలో గత మూడ్రోజులుగా వరుసగా స్వల్ప భూప్రకంపనలు ప్రజలను ఆందోళన రేకెత్తిస్తున్నాయి. సింగనపాలెం, ముండ్లమూరు, మారెళ్ల, శంకరాపురం పరిసర ప్రాంతాల్లో ఇవాళ భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
అసలేం జరుగుతోంది?
గత రెండ్రోజులుగా ప్రకాశం జిల్లాలోని తాళ్లూరు, ముండ్లమూరు మండలాల్లోని గ్రామాల్లో స్వల్పంగా భూప్రకంపనలు రావడంతో ప్రజలు భయపడుతున్నారు. వరుసగా మూడో రోజు ఇవాళ ప్రకంపనలు రావడంతో భయంతో బయటకు పరుగులు తీశారు. అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదని అయోమయానికి గురవుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు
ఇటీవల 4వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల స్వల్ప భూ ప్రకంపనలు (Telangana Earthquake) సంభవించిన విషయం తెలిసిందే. భయానికి గురైన ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. తెలంగాణలోని ముగులు జిల్లా మేడారంలో భూకంప కేంద్రాన్ని గుర్తించిన అధికారులు రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైనట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేట, ఏలూరు, నందిగామ.. తెలంగాణలోని హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ జిల్లాల పరిధిలో భూమి కంపించింది.






