Mana Enadu : హైదరాబాద్ ఫార్ములా ఈ-రేసు కేసు (Hyderabad Formula E Race Case)లో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రిపై ఏసీబీ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన తాజాగా హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసు కోసం ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ (ED Enters Formula E Race Case) అధికారులు రంగంలోకి దిగారు. కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఏసీబీకి ఈడీ లేఖ రాసింది. వివరాలు రాగానే మనీలాండరింగ్ కేసు నమోదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
హైకోర్టుకు కేటీఆర్..
ఇక అంతకుముందు ఈ వ్యవహారంలో ఏసీబీ (KTR ACB Case) తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ కేటీఆర్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనను అరెస్టు చేయకుండా స్టే ఇవ్వాలని సింగిల్ బెంచ్ ముందు అప్పీల్ చేశారు. అయితే ఆ బెంచ్‌లో క్వాష్ పిటిషన్ విచారణకు అనుమతి లేదంటూ ఏసీబీ కౌన్సిల్.. కోర్టుకు తెలపగా.. కేటీఆర్ తరఫు లాయర్.. చీఫ్ కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ గురించి మెన్షన్ చేశారు. ఈ క్రమంలో పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని రిజిస్ట్రీకి ఆదేశాలు అందడంతో.. మధ్యాహ్నం 2.15 కు హైకోర్టు (KTR Petition in High Court) చీఫ్ జస్టిస్ బెంచ్‌పై లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు రానుంది.
అసలు ఈ కేసు ఏంటంటే..?
ఫార్ములా ఈ-రేసు నిర్వహణ కోసం నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు భారీ నగదు చెల్లించారంటూ మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిశోర్ (Dana Kishore) ఏసీబీకి ఈ ఏడాది అక్టోబరు 18వ తేదీన ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనివల్ల ప్రభుత్వానికి రూ.54.88 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వ్యవహారంలో అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌పై ఏసీబీ అధికారులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఆయన్ను ఏ1గా, సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ (IAS Arvind Kumar) ఏ2గా, హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ BLN రెడ్డి ఏ3గా చేర్చారు.






