బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం(Promotion of betting apps) చేసిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో విజయ్ దేవరకొండ(Vijaty Devarakonda), రానా దగ్గుబాటి(Rana Daggubati), ప్రకాష్ రాజ్(Prakash Raj), మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత సుభాష్, అనన్య నాగళ్లతో పాటు టీవీ యాంకర్లు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు సహా మొత్తం 29 మందిపై ఈడీ ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR) నమోదు చేసింది. ఈ కేసు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద నమోదైంది. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పంజాగుట్టా, మియాపూర్, సైబరాబాద్, సూర్యాపేట, విశాఖపట్నం పోలీస్ స్టేషన్లలో దాఖలైన ఐదు FIRల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది.

భారీ మొత్తంలో ఆర్థిక ప్రయోజనాలు పొందినట్లు ఆరోపణ
ఈ సెలబ్రిటీలు జంగిల్ రమ్మీ, ఏ23, జీత్‌విన్, పారిమ్యాచ్, లోటస్ 365 వంటి నిషేధిత బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ యాప్‌లు స్కిల్ బేస్డ్ గేమ్‌లుగా చెప్పుకుని, నిజానికి చట్టవిరుద్ధ జూదం కార్యకలాపాలను నిర్వహించినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ ప్రచారాల ద్వారా వీరు భారీ మొత్తంలో ఆర్థిక ప్రయోజనాలు పొందినట్లు, ఇవి మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లుగా అధికారులు భావిస్తున్నారు.
ఎవరెవరకి ఏ రోజు విచారణ అంటే
రాణా దగ్గుబాటిని జులై 23న, ప్రకాష్ రాజ్‌ను జులై 30న, విజయ్ దేవరకొండను ఆగస్టు 6న, మంచు లక్ష్మిని ఆగస్టు 13న విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. కొందరు సెలబ్రిటీలు తాము చట్టవిరుద్ధ యాప్‌లను ప్రచారం చేయలేదని, తమ ప్రమేయం కేవలం చట్టబద్ధమైన స్కిల్ గేమ్‌లకు మాత్రమే పరిమితమని వారు వాదించారు. అయితే, వీరి ప్రభావంతో పలువురు యువకులు బెట్టింగ్ యాప్‌లలో డబ్బులు పోగొట్టుకోవడంతో పాటు కొంతమంది ఆత్మహత్యకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. బెట్టింగ్ యాప్‌ల ద్వారా నిర్వాహకులు కోట్లాది రూపాయలు కొల్లగొట్టారని ఆరోపణలు ఉన్నాయి.
Actors, anchors, TV hosts among 29 booked by ED for promoting illegal betting apps.
The case revolves around paid promotions for platforms such as Junglee Rummy, A23, JeetWin, Parimatch, Lotus365, involved in large-scale money laundering— biju govind (@bijugovind) July 10, 2025






