ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ(Anil Ambani)కి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు(Summons) జారీ చేసింది. రూ.17,000 కోట్ల విలువైన రుణ మోసం(Loan Fraud) కేసులో ఆయనను ఆగస్టు 5న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసు మనీలాండరింగ్ ఆరోపణల(Money laundering allegations)తో ముడిపడి ఉంది. ప్రధానంగా 2017-2019 మధ్య YES బ్యాంక్ నుంచి అంబానీ గ్రూప్ కంపెనీలకు రూ.3,000 కోట్ల రుణాలు మంజూరైన తీరును ఈడీ పరిశీలిస్తోంది. ఈ రుణాలు అక్రమంగా మళ్లించబడ్డాయని, షెల్ కంపెనీల(Shell companies)కు బదిలీ అయ్యాయని ఆరోపణలు ఉన్నాయి.
మొత్తం 85 చోట్ల సోదాలు
కాగా జులై 24 నుంచి మూడు రోజులపాటు ఈడీ ముంబై, ఢిల్లీలో 35 ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో 50 కంపెనీలు, 25 వ్యక్తులతో సహా అంబానీ గ్రూప్(Ambani Group)కు చెందిన కీలక అధికారులను లక్ష్యంగా చేసుకుంది. యెస్ బ్యాంక్ ప్రమోటర్లకు రుణాల మంజూరీకి ముందు లంచం రూపంలో చెల్లింపులు జరిగాయని ఈడీ అనుమానిస్తోంది. సెబీ(SEBI), నేషనల్ హౌసింగ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదికలు, CBI ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈ విచారణ జరుగుతోంది.

ఈ కంపెనీల లావాదేవీలపై ఈడీ ఫోకస్
రిలయన్స్ పవర్(Reliance Power), రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్(Reliance Infrastructure) కంపెనీలు ఈ సోదాలు తమ వ్యాపార కార్యకలాపాలపై ప్రభావం చూపలేదని, అంబానీ ఈ కంపెనీల బోర్డులో లేరని స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపాయి. అయితే, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, రిలయన్స్ కమ్యూనికేషన్స్‌లో గత లావాదేవీలపై ఈడీ దృష్టి సారించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల అంబానీ, ఆర్‌కామ్‌ను ‘ఫ్రాడ్’గా వర్గీకరించిన నేపథ్యంలో ఈడీ నోటీసులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
🚨 BREAKING:
ED SUMMONS ANIL AMBANI on Aug 5 in ₹3,000 Cr loan diversion case 💥Officials allege loans from banks may have been misused. Ambani to record statement before ED.
A high-stakes probe shaking India’s corporate world! ⚡ pic.twitter.com/IRDdxxgeDO
— Global Breaking 🚨 (@GlobalBreaking4) August 1, 2025






