Tirumala: తిరుమల తిరుపతి.. మీకు ఈ విషయాలు తెలుసా?

కలియుగ దైవం.. తిరుమల తిరుపతి వేంకటేశుడి(Tirumala Tirupati Venkateshwara swamy) దివ్య దర్శన భాగ్యం కోసం నిత్యం ఎంతో మంది భక్తులు(The devotees) ఆ ఏడుకొండలకు వస్తుంటారు. శ్రీనివాస గోవిందా.. శ్రీ వేంకటేశా గోవిందా.. అనే భక్తి కీర్తనం ఆ తిరుమల శ్రీనివాసుడి సన్నిధి(Presence of Srinivasa)లో వింటే చాలు భక్తి పారవశ్యంలో పరవశించి పోవాల్సిందే. ఏడుకొండల(Seven Hills) మీద కొలువైన ఏడుకొండల వాడిని దర్శించుకునేందుకు చాలామంది భక్తులు అలిపిరి, శ్రీవారి మెట్ల(
Alipiri, Srivari Metlamargam) మార్గంలో కొండకు వెళ్తారు. తెలుగు రాష్ట్రాల నుండే కాక, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. అంతేకాదు విదేశాల నుంచీ స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు రావడం పరిపాటి. స్వామివారిని దర్శించిన భక్తులు లడ్డూ ప్రసాదాన్ని(Laddu prasadam) పవిత్రంగా భావిస్తుంటారు.

దేవదేవుడి దర్శనం కోసం ఎక్కడున్నా సరే..

ప్రపంచం నలుమూలల ఎక్కడ ఉన్నా సరే ఒక్కసారైనా ఆ దేవదేవుడిని దర్శించుకోవాలని హిందువులు(Hindus) భావిస్తుంటారు. అయితే స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు చాలా వరకు అలిపిరి మెట్ల మార్గాన్ని(Alipiri Stairway) ఆశ్రయిస్తారు. కానీ కాలి నడకన వెళ్లే వారికి 8 మార్గాలు ఉన్నాయని తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఆ ఏ మార్గాలు ఏంటి? ఎక్కడున్నాయి? ఓసారి తెలుసుకుందామా..

☛ మొదటిది అలిపిరి మెట్లు(Alipiri Stairway) మనందరికీ బాగా తెలిసిన దారి. తిరుమల వెంకటేశ్వరుడిని గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ దారి గురించి బాగా తెలుసు. మొత్తం 3550 మెట్లు ఉంటాయి.

☛ 2వది శ్రీవారి పాదాలు(Srinivasa Padaalu) శ్రీనివాసుడు వైకుంఠం నుంచి వచ్చేటప్పుడు మొదటి పాదం ఇక్కడే పెట్టారని చెబుతారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇక్కడ అనుమతిస్తారు.

☛ 3వది తిరుమలకు వెళ్లే వాటిల్లో మూడవ దారి మామండూరు(Mamanduru). ఇది తిరుమల కొండకు ఈశాన్య దిక్కున ఉంటుంది. దీనికి మించిన దారి ఇంకొకటి లేదు అంటారు పూర్వీకులు. విజయనగర రాజులు ఈ దారిలో నడిచే యాత్రికుల సౌకర్యార్థం రాతిమెట్లను కూడా ఏర్పాటు చేశారు.

☛ 4వ మార్గం శ్యామలకోన(Syamalakona) తిరుమల కొండకు పశ్చిమాన కళ్యాణీ డ్యామ్ ఉంటుంది. దానిని ఆనుకొని శ్యామలకోన ప్రాంతం నుంచి తిరుమలకు వెళ్లవచ్చు.

☛ 5వ మార్గం కళ్యాణీ డ్యామ్ మలుపు(Kalyani Dam turn) వద్ద నుంచి మూడు కిలోమీటర్లు ముందుకు వెళ్తే ఒక మలుపు వస్తుంది. అక్కడి నుంచి తూర్పు వైపు తిరిగి మరికొంత దూరం ప్రయాణిస్తే తిరుమలలోని ఎత్తైన నారాయణగిరి వస్తుంది.

☛ 6వది కుక్కల దొడ్డి(Kukkala Doddi) కడప సరిహద్దుల్లో చిత్తూరు ప్రారంభంలో కుక్కల దొడ్డి అనే ఒక ప్రాంతంలో తుంబురుతీర్థం, పాప వినాశనం మీదుగా తిరుమలకు వెళ్లవచ్చు.

☛ 7వ మార్గం అవ్వా చారి కోన అన్నింటిలో ఏడవదారి అవ్వా చారి కోన. ఈ దారి గుండా వెళ్తే కూడా తిరుమల కొండకు చేరుకోవచ్చు. ఇది రేణిగుంట సమీపంలోని ఆంజనేయపురం అనే గ్రామం నుంచి తిరుమలకు చేరుకోవచ్చు.

☛ 8వది ఏనుగుల దారి(Elephant Path) అంటే ఏనుగులు ప్రయాణించిన దారి కాబట్టి ఆ పేరు వచ్చిందని పూర్వీకులు చెబుతారు. తిరుమలలో నిర్మించిన అందమైన మండపాలకు కావలసిన రాతి స్తంభాలను ఏనుగుల గుండా ఈ మార్గాన చేరవేశారట.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *