
ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో గురువారం పిడుగులు (Thunderstorm) బీభత్సం సృష్టించాయి. జిల్లాలోని గాదిగూడ, బేల మండల్లాలో పిడుగులు పడి 8 మంది మృతి చెందారు. వీరంతా ఆదివాసీలే. పొలాలు, చేనుల్లో వ్యవసాయ పనులు చేస్తుండగా ఉరుములు మెరుపులతో కూడిన పిలుగు కూలీల ప్రాణాలను బలిగొన్నాయి. గాదిగూడ మండలంలోని ఓ చేనులో కొందరు పనులు చేస్తుం ఒక్కసారిగా పిడుగుపడింది. దీంతో స్పాట్లోనే నలుగురు చనిపోయారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. వారిని సమీప పొలాల్లో పనులు చేస్తున్న రైతులు క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలిస్తుండగా మార్గమధ్యలో మరో ఇద్దరు మృతిచెందారు. ప్రస్తుతం ఆరుగురు ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. బేల మండలంలోని సాంగ్డీలో ఓ మహిళ, సోన్కచ్ గ్రామంలో మరో మహిళ పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోయారు.