Elon Musk: ఎలాన్ మస్క్ సందప ఎంతో తెలుస్తే షాకవ్వాల్సిందే!

Mana Enadu : స్పేస్‌ ఎక్స్‌(Space X),టెస్లా(Tesla) అధినేత ఎలాన్‌ మస్క్‌(Elon Musk) ప్రపంచ రికార్డు సృష్టించాడు. వ్యక్తిగత సంపాదన పరంగా తొలిసారి 400 బిలియన్ డాలర్ల(400 billion dollars) క్లబ్‌‌లోకి ఈ అపర కుబేరుడు చేరిపోయాడు. ప్రపంచంలో ఇంతవరకు ఇంత సంపాదించిన వ్యక్తి మరొకరు లేరు. స్పేస్‌ ఎక్స్‌‌లోని అంతర్గత వాటా(Shares) విక్రయంతో ఆయన సంపాదన దాదాపు 50 మిలియన్‌ డాలర్లు పెరిగి 439.2 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నట్లు బ్లూమ్‌ బర్గ్‌ బిలియనీర్స్‌ సూచీ(Bloomberg Billionaires Index) వెల్లడించింది. 2022లో 200 బిలియన్‌ డాలర్ల కంటే దిగువకు పడిపోయిన మస్క్‌. ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల(America Elections) ఫలితాలతో అంతా మారిపోయింది.

ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ(Republican Party)కి అత్యధిక విరాళాలు ఇచ్చిన మస్క్‌.. ట్రంప్‌(Trump) విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో మస్క్‌ సంపాదన రోజురోజుకు పెరుగుతూ వస్తోంది. ట్రంప్‌ విజయం అనంతరం టెస్లా స్టాక్స్‌(Tesla Stocks) దాదాపు 65 శాతం పెరిగాయి. అంతేకాకుండా ట్రంప్‌ విజయంతో సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్ల(Self Driving Cars)ను క్రమబద్ధీకరిస్తారని మార్కెట్‌ వర్గాలు అనుకుంటున్నాయి. ఇక టెస్లా పోటీదారులకు మేలు చేసే ఎలక్ట్రిక్‌ వాహనాలపై టాక్స్‌ క్రెడిట్‌(Tax Credits)లను ట్రంప్‌ తొలగించవచ్చని బ్లూమ్‌ బర్గ్‌ ఇటీవల నివేదించింది.

ఇదిలా ఉంటే మస్క్‌ కు చెందిన ఆర్టిఫిషియల్‌ స్టార్టప్‌ ఎక్స్‌ AI గత మే నుంచి నిధుల సేకరణ ప్రారంభించింది. దీంతో దాని విలువ రెండింతలై 50 బిలియన్‌ డాలర్లకు చేరింది.ఇక బుధవారం స్పేస్‌ ఎక్స్‌(SpaceX), దాని పెట్టుబడిదారులు(Investors) ఒక ఒప్పందం(MoU) కుదుర్చుకున్నారు. 1.25 బిలియన్‌ డాలర్ల విలువ గల షేర్లను స్పేస్‌ ఎక్స్‌ ఉద్యోగులు, కంపెనీ ఇన్‌ సైడర్ల నుంచి కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. దీంతో స్పేస్‌ ఎక్స్‌ 350 బిలియన్‌ డాలర్ల విలువకు చేరి ప్రపంచంలోనే అత్యంత విలువైన ప్రైవేట్‌ స్టార్టప్‌‌గా స్పేస్‌ ఎక్స్‌(Private Startup Space X) రికార్డు సృష్టించింది. కాగా ట్రంప్‌ క్యాబినెట్‌‌లో మస్క్‌‌కు కీలక పదవి కూడా దక్కిన విషయం తెలిసిందే.

Related Posts

Gold & Silver Price: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు (Gold Rate) భారీగా పెరిగాయి. అంతర్జాతీయ, జియోపాలిటికల్ పరిణామాల నేపథ్యంలో ఈ పెరుగుదల నమోదైంది. ఇండియా-అమెరికా మధ్య టారిఫ్‌ల ప్రభావం, మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, డాలర్‌(Dollar) క్షీణత వంటి కారణాలతో అంతర్జాతీయంగా పసిడి, వెండి ధరల (Gold…

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. కేజీ వెండి రేటెంతంటే?

బంగారం ధరలు(Gold Rates) రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌(Hyderabad Bullion Market)లో ఈ రోజు (ఆగస్టు 29) 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.710 పెరిగి రూ.1,03,310కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *