Elon Musk: ట్రంప్‌కు షాక్.. డోజ్ నుంచి తప్పుకున్న మస్క్

టెస్లా, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) ట్రంప్‌కు షాకిచ్చారు. తాను డోజ్‌ (Department of Government Efficiency) నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు దీనికి సంబంధించి ఎక్స్(X)లో పోస్ట్ చేశారు. ఇక మీదట ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లో తన జోక్యం ఉండదని స్పష్టం చేశారు. అమెరికా ప్రభుత్వం(US Govt)లో ప్రత్యేక గవర్నమెంట్ ఉద్యోగి(Special Government Employee)గా తన షెడ్యూల్ ముగిసిందని మస్క్ చెప్పారు. తాను లేకపోయినా DOGE భవిష్యత్తులో మరింత బలపడుతుందని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఖర్చులు తగ్గించేందుకు తనకు అవకాశమిచ్చిన అధ్యక్షుడు ట్రంప్‌(Trump)కు ఎలాన్ మస్క్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

 

నేను వచ్చిన పని అయిపోయింది: మస్క్

 

కాగా డోజ్ ద్వారా ప్రభుత్వానికి 1 ట్రిలియన్ డాలర్ల భారం తగ్గించామని, తాను వచ్చిన పని అయిపోయిందని ఎలాన్ మస్క్ చెప్పారు. మే 2025లో వార్షిక ఫెడరల్ లోటు(Annual federal deficit)ను సగానికి అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. తన బృందం రోజుకు నాలుగు బిలియన్ డాలర్ల లోటును సరిచేస్తూ వారంలో ఏడు రోజులు కష్టపడి పనిచేసిందని మస్క్ చెప్పుకొచ్చారు. DOGE మే 2025లోపు దాదాపు 7 ట్రిలియన్ల డాలర్లనుంచి 6 ట్రిలియన్ల డాలర్లకు తగ్గించగలదని గట్టి నమ్మకమని చెప్పారు. అందుకే DOGEను వదిలేశానని అన్నారు.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *