
మాంచెస్టర్(Manchester) వేదికగా ఇండియా వర్సెస్ ఇంగ్లండ్(India vs England) మధ్య నాలుగో టెస్టు తొలిరోజు(4th Test Day1) ఆట ముగిసింది. ఈ మ్యాచులో టాస్ నెగ్గిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben Stokes) బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 264/4 రన్స్ చేసింది. ఓపెనర్లు జైస్వాల్ (58), రాహుల్ (46) రన్స్‌తో తొలి వికెట్‌కు 94 రన్స్ చేసి శుభారంబాన్ని అందించారు. అయితే జట్టు స్కోరు 120 దగ్గర జైస్వాల్, 140 పరుగుల దగ్గర గిల్ (12) ఔటవడంతో భారత్ కష్టాల్లో పడింది. యంగ్ బ్యాటర్ సాయి సుదర్శన్ (61) హాఫ్ సెంచరీతో రాణించాడు.
పంత్‌కు గాయం.. ఆసుపత్రికి తరలింపు
మరో ఎండ్‌లో రిషభ్ పంత్ (37 రిటైర్డ్ హర్ట్) దూకుడుగా ఆడుతూ ఇంగ్లండ్‌పై టెస్టుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన తొలి వికెట్ కీపర్‌గా చరిత్ర సృష్టించాడు. అయితే, క్రిస్ వోక్స్(Woaks) బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ఆడబోయి పంత్(Pant) కుడి పాదానికి తీవ్ర గాయమైంది. దీంతో వెంటనే సిబ్బంది అతడిని ఆసుపత్రికి తరలించారు. ఇది భారత జట్టుకు పెద్ద దెబ్బగా మారింది. కాగా ప్రస్తుతం రవీంద్ర జడేజా (19*), ఠాకూర్ (19*) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టోక్స్ 2 వికెట్లు తీయగా, వోక్స్, డాసన్ చెరో వికెట్ తీశారు. కాగా రెండో రోజు భారత్ వీలైనన్ని ఎక్కువ రన్స్ చేసి ఆతిథ్య జట్టుపై ఒత్తిడి పెంచాలని చూస్తోంది. కాగా ఐదు మ్యాచుల సిరీస్‌లో 1-2తో భారత్ వెనుకబడిన విషయం తెలిసిందే.
RISHABH PANT RETIRED HURT💔
He has been taken off the field as he was unable to stand! pic.twitter.com/EuxY2iYOc0
— CRICKETNMORE (@cricketnmore) July 23, 2025