INDvs ENG: ఇక వన్డే సమరం.. నేడు భారత్-ఇంగ్లండ్‌ మధ్య తొలి మ్యాచ్

సొంతగడ్డపై ఇంగ్లండ్‌(England)తో జరిగిన 5 మ్యాచుల టీ20 సిరీస్‌ను 4-1తో పట్టేసిన టీమ్ఇండియా(Team India).. ఇప్పుడు అదే జట్టుతో వన్డే సమరానికి రెడీ అయ్యింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 6) నాగ్‌పూర్ వేదికగా తొలి వన్డే జరగనుంది. ఈనెల 19 నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) ప్రారంభం కానుండటంతో ఈ సిరీస్ ఇరు జట్ల ఆటగాళ్లకు పరీక్షగా నిలవనుంది. మరోవైపు పేలవ ఫామ్‌లో ఉన్న టీమ్ఇండియా సారథి రోహిత్ శర్మ(Rohit Sharma), సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, KL రాహుల్, గిల్ తదితరులు ఈ మ్యాచులో ఎలా రాణిస్తారన్న దానిపై భారత విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. అటు ఇంగ్లండ్ జట్టులోకి సీనియర్ బ్యాటర్ జో రూట్(Joe Root) ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఈ మ్యాచ్‌ ఆసక్తికరంగా జరగనుండటం ఖాయం. కాగా ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ సిరీస్‌కు Star Sports Network అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తోంది.

హెడ్-టు-హెడ్ ఇలా..

కాగా ఇరు జట్లు ఇప్పటి వరకు భార‌త్, ఇంగ్లాండ్ జ‌ట్లు ఇప్ప‌టి వ‌ర‌కు 107 ODI మ్యాచ్‌లో త‌ల‌ప‌డ్డాయి. ఇందులో 58 మ్యాచ్‌ల్లో భార‌త్ విజ‌యం సాధించ‌గా ఇంగ్లండ్ 44 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. రెండు మ్యాచ్‌లు టైగా ముగియ‌గా 3మ్యాచ్‌ల్లో ఫ‌లితం తేల‌లేదు. భారత గడ్డపై 52 వ‌న్డేల్లో త‌ల‌ప‌డగా భార‌త్ 34 మ్యాచ్‌ల్లో గెలిచింది. 17 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.

వన్డే సిరీస్ షెడ్యూల్:

1st ODI: ఫిబ్రవరి 6న – నాగ్‌పూర్
2nd ODI: ఫిబ్రవరి 9న – కటక్
3rd ODI: ఫిబ్రవరి 12న – అహ్మదాబాద్

వ‌న్డే సిరీస్‌కు జ‌ట్లు ఇవే..

INDIA: రోహిత్ శర్మ(C), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, KL రాహుల్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా

ENGLAND: హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జోరూట్, జాకోబ్ బెతెల్, లియామ్ లివింగ్‌స్టోన్, బ్రైడన్ కార్స్, జేమీ ఓవర్టన్, జోస్ బట్లర్(C), జేమీ స్మిత్, ఫిలిప్ సాల్ట్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, మార్క్ వుడ్.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *