లండన్‌లోని ఐకానిక్ లార్డ్స్(Lord’s) మైదానంలో జరిగిన మూడో టెస్టు(Third Test) మ్యాచ్‌లో భారత్‌కు నిరాశే ఎదురైంది. చివరి వరకు ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచులో టీమ్ఇండియా(Team India) 22 పరుగుల తేడాతో ఓడింది. దీంతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యం సాధించింది. 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 170 పరుగులకే ఆలౌట్ అయింది. రవీంద్ర జడేజా (61 నాటౌట్) ఒంటరి పోరాటం సాగించినప్పటికీ, ఇతర బ్యాట్స్‌మెన్ సహకారం లేకపోవడంతో జట్టు ఓటమిని తప్పించలేకపోయింది.
చివరి రోజు భారత్ 58/4తో ఆరంభించినప్పటికీ, రాహుల్ (33), పంత్(9)లు త్వరగా ఔట్ కావడంతో ఒత్తిడి పెరిగింది. జడేజా, జస్ప్రీత్ బుమ్రా (9), మహ్మద్ సిరాజ్ (4) గట్టి పోరాటం చేసినప్పటికీ, షోయబ్ బషీర్ తుది వికెట్ తీసి ఇంగ్లండ్(England)కు అపురూప విజయాన్ని అందించాడు. బెన్ స్టోక్స్ (77 పరుగులు, 5 వికెట్లు) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
ఈ 23 నుంచి మాంచెస్టర్‌లో నాలుగో టెస్ట్
కాగా అంతకుముందు మొదటి ఇన్నింగ్స్‌లో రెండు జట్లూ 387 పరుగులు చేసి సమం చేశాయి. భారత్ తరఫున కేఎల్ రాహుల్ (100), రిషభ్ పంత్ (74), జడేజా (72) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్(Jofra Archar), బెన్ స్టోక్స్(Ben Stokes)లు రెండేసి వికెట్లు తీశారు. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 192 పరుగులు చేసి ఆలౌట్ కాగా, వాషింగ్టన్ సుందర్ (4/22) భారత బౌలర్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఈ ఓటమితో భారత్ సిరీస్‌లో వెనుకబడినప్పటికీ, జడేజా(Jadeja) ఫామ్, బౌలర్ల ప్రదర్శన సానుకూలాంశాలుగా నిలిచాయి. నాలుగో టెస్టు జులై 23 నుంచి మాంచెస్టర్‌లో జరగనుంది.
A remarkable finish at Lord’s 🤯 pic.twitter.com/Th7wTApsrk
— Wisden (@WisdenCricket) July 14, 2025






