ENGW vs INDW 2nd T20I: ఫామ్‌లో టీమ్ఇండియా.. నేడు ఇంగ్లండ్ ఉమెన్స్‌తో రెండో టీ20

ఇంగ్లండ్‌ ఉమెన్స్‌(England Women)తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్‌లో భారత మహిళల(India Women) క్రికెట్ జట్టు నేడు రెండో మ్యాచు ఆడనుంది. బ్రిస్టల్‌(Bristol)లోని కౌంటీ గ్రౌండ్‌లో జరిగే ఈ మ్యాచులోనూ ఆతిథ్య జట్టును ఓడించి సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని మంధాన సేన భావిస్తోంది. మొదటి మ్యాచ్‌లో భారత్ 97 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో స్మృతి మంధాన (112) తన తొలి T20I శతకంతో చెలరేగగా, హర్లీన్ దియోల్ (43) మద్దతు ఇచ్చింది. శ్రీ చరణి 4/12 వికెట్లతో ఇంగ్లండ్‌ను 113 పరుగులకే కుప్పకూల్చింది.

Latest Cricket News 2024: Live Score | Results | Match Schedules - Mid-day

హర్మన్‌ప్రీత్ కౌర్ ఆడుతుందా?

ఈ రెండో T20Iలో భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) తిరిగి రావడంపై ఆసక్తి నెలకొంది. వార్మప్ మ్యాచ్‌లో గాయం కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమైన ఆమె, ఈ మ్యాచ్‌లో ఆడితే జట్టుకు మరింత బలం చేకూరుతుంది. మంధాన ఫామ్ కొనసాగించడం, షెఫాలీ వర్మ ఎటాకింగ్ గేమ్ ఆడటం భారత్‌కు కీలకం. బౌలింగ్‌లో దీప్తి శర్మ, రాధా యాదవ్‌లు స్పిన్‌తో ఇంగ్లండ్‌ను కట్టడి చేయాలని భావిస్తున్నారు.

బౌన్స్ బ్యాక్ కావాలని చూస్తోన్న ఇంగ్లండ్

మరోవైపు, ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ నాట్ స్కివర్-బ్రంట్(Nat Sciver-Brunt) నేతృత్వంలో బౌన్స్ బ్యాక్ కావాలని చూస్తోంది. తొలి మ్యాచులో లారెన్ బెల్ (3/27) బౌలింగ్‌లో మెరుగ్గా రాణించినప్పటికీ, డానీ వైట్-హాడ్జ్ వంటి ఆటగాళ్లు బ్యాటింగ్‌లో పుంజుకోవాల్సి ఉంది. సోఫీ ఎక్కల్‌స్టోన్(Sophie Ecclestone) స్పిన్ దాడి భారత్‌కు సవాలు విసరనుంది. ఈ సిరీస్ రాబోయే 2026 T20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా ఉండటంతో, రెండు జట్లూ గట్టిగా పోరాడనున్నాయి. మ్యాచ్ భారత కాలమానం ప్రకారం(IST) రాత్రి 11 గంటలకు ప్రారంభమవుతుంది. సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్, సోనీలివ్, ఫ్యాన్‌కోడ్‌లలో ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉంటుంది.

తుది జట్ల అంచనా

India Women: స్మృతి మంధాన (C), షఫాలీ వర్మ, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్/హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్ (Wk), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, స్నేహ రాణా, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, శ్రీ చరణి.

England Women: సోఫియా డంక్లీ, డేనియల్ వ్యాట్-హాడ్జ్, నాట్ స్కైవర్-బ్రంట్ (C), టామీ బ్యూమాంట్, అమీ జోన్స్ (Wk), ఆలిస్ కాప్సే, సోఫీ ఎక్లెస్టోన్, ఎమ్ ఆర్లాట్, లారెన్ ఫైలర్, లిన్సే స్మిత్, లారెన్ బెల్.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *