టీమ్‌ఇండియా క్రికెటర్ హార్దిక్ పాండ్య (Hardik Pandya)తో బాలీవుడ్ నటి ఇషా గుప్తా (Esha Gupta) డేటింగ్లో ఉన్నట్లు అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని, ప్రేమలో మునిగిపోయారని సోషల్ మీడియాలో జనాలు తెగ చర్చించుకున్నారు. అయితే హార్దిక్తో అప్పట్లో డేటింగ్పై ఇషా తాజాగా స్పందించారు. కొంతకాలం తమ మధ్య స్నేహం కొనసాగిందన్నారు. కానీ తాము డేటింగ్ దశలోకి అడుగుపెట్టకముందే అంతా ముగిసిపోయిందన్నారు.
రెండు, మూడుసార్లు మాత్రమే కలిశాం..
‘నాకు, హార్దిక్కు అప్పట్లో క్రితం స్నేహం ఏర్పడింది. కొన్ని నెలల పాటు మాట్లాడుకున్నాం. కానీ మేమిద్దరం డేటింగ్‌లో ఉన్నామని నేను అనుకోవడం లేదు. మా మధ్య మాటలు మొదలైనప్పుడు.. డేటింగ్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉండొచ్చు, లేకపోనూవచ్చు అని ముందే ఫిక్స్ అయ్యాం. కానీ రిలేషన్‌లోకి అడుగుపెట్టకుండానే మేమిద్దరం విడిపోయాం. రెండు, మూడుసార్లు మాత్రమే కలిశాం. కొన్ని నెలల పాటు మా మధ్య అనుబంధం కొనసాగింది. ఆ తర్వాత అది ముగిసిపోయింది’ అని ఇషా గుప్తా తెలిపారు.
ఆ విమర్శలు నన్ను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు
అప్పట్లో ‘కాఫీ విత్ కరణ్’ షోలో మహిళలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలతో హార్దిక్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ అంశంపై కూడా ఈషా స్పందించారు. ‘హార్దిక్పై ఆ విమర్శలు నన్ను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే అప్పటికే మేమిద్దరం విడిపోయాం’ అని పేర్కొన్నారు.
Actress Esha Gupta responded to rumours that she and cricketer Hardik Pandya were dating in 2018.
She said, “I don’t think we were dating…we were talking for a couple of months. We were at that ‘maybe it’ll happen, maybe it won’t’ stage…It ended before we even… pic.twitter.com/bGR0lqE1KT
— Nitesh Sharma (@nitesh1572) June 25, 2025






