హాలీవుడ్ స్టార్ హీరో బ్రాడ్ పిట్ (Brad Pitt) నటించిన “F1” సినిమా భారీ కలెక్షన్లను (Huge collections) కొల్లగొట్టింది. ప్రముఖ దర్శకుడు జోసెఫ్ కోసిన్స్కీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు హాన్స్ జిమ్మర్ సంగీతం అందించగా.. డామ్సన్ ఇడ్రిస్, జావియర్ బార్డెమ్, కెర్రీ కాండన్, టోబియాస్ మెంజీస్, సారా నైల్స్, కిమ్ బోడ్నియా, సామ్సన్ కాయో వంటి నటులు నటించారు. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఈ సినిమాకు భారత్ దేశంలో హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనేక థీయేటర్లు దక్కాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కీలక పట్టణాల్లో సైతం ఈ సినిమా హౌస్ ఫుల్ బోర్డులను చూసింది. అయితే భారీ అంచనాలతో విడుదలైన ఈ F1 మూవీ ఊహించినట్లుగానే.. కలెక్షన్ల సునామీ సృష్టించింది.

ఇండియాలో 70 కోట్ల కలెక్షన్లు
ఈ సినిమా.. $300 మిలియన్ (రూ. 2,565 కోట్లు)గా వ్యయంతో ఆపిల్ స్టూడియోస్ (Apple Studios) నిర్మించగా.. కేవలం రెండు వారాల్లోనే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ 2,656 కోట్లు కలెక్ట్ చేసినట్లు బాక్సాఫీస్ వర్గాలు తెలిపాయి. మొదటి నుంచి హాలీవుడ్ సినిమాలకు భారత్ లో మంచి మార్కెట్ ఉండగా.. F1 సినిమాకు సైతం కేవలం ఇండియాలోనే 70 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం థియేటర్లు పెరుగుతుండటంతో ఈ సంఖ్య 100 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.
Christopher Nolan made a surprise visit to an independent Scottish cinema to see the F1 movie.
No photos were allowed because Nolan wanted to remain “incognito.”
In a post, the Moray Playhouse said: “We had the pleasure of a visit from the man himself, Christopher Nolan, to the… pic.twitter.com/si97gGILzJ
— Nolan Archive (@NolanAnalyst) July 10, 2025






