హైదరాబాద్ లో గల్లీకో శంకర్ దాదా.. రామంతాపూర్ లో పట్టుబడ్డ నకిలీ డాక్టర్

Mana Enadu : ఇటీవల నకిలీ మందుల సరఫరాయే కాదు.. నకిలీ వైద్యుల బాగోతం కూడా బయటపెడుతోంది తెలంగాణ మెడికల్ కౌన్సిల్(Telangana Medical Council). వరుస తనిఖీలు చేస్తూ నకిలీ డాక్టర్లపై ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా హైదరాబాద్ రామంతాపూర్ లో రిజిస్టర్డ్ వైద్యుడి పేరు మీద చికిత్స చేస్తున్న నకిలీ డాక్టర్ గుట్టురట్టు చేసింది. ఈ క్రమంలో క్లినిక్ తనిఖీ చేయగా.. అందులో నొప్పి నివారణ ఇంజెక్షన్స్, యాంటీ బయోటిక్స్, సిరప్స్ ను గుర్తించి సీజ్ చేశారు. 

హైదరాబాద్ మహానగరంలో గల్లీకో శంకర్ దాదాలు(Fake Doctors) పుట్టుకొస్తున్నారు. తాజాగా రామంతపూర్ లోనూ ఓ శంకర్ దాదా ఎంబీబీఎస్ పట్టుబడ్డాడు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కు వచ్చిన ఫిర్యాదుల మేరకు కౌన్సిల్ మెంబెర్స్, పి ఆర్ కమిటీ చైర్మన్ డా.నరేష్ కుమార్, సీపీడీ కమిటీ ఛైర్మన్ డా.ప్రతిభ లక్ష్మి, HRDA రాష్ట్ర నాయకుడు డా. బి. వంశీ కృష్ణ .. హైదరాబాద్ లోని ఉప్పల్ దగ్గర లో ఉండే రామంతాపూర్, బీరప్ప గూడ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. రామంతాపూర్ నెహ్రు నగర్ ప్రాంతంలో SVL క్లినిక్, డా.నర్సింహా చారి, MBBS పేరు మీద అనుమతి తీస్కోని ఆవంచ సురేష్ నకిలీ డాక్టర్ అవతారమెత్తాడు.

మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో వైద్య పరంగా ఎటువంటి విద్యార్హత లేకుండా సురేశ్ రోగులకు చికిత్స చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. మరోవైపు రామంతాపూర్ లోని రామ్ రెడ్డి నగర్ లో రామంతాపూర్ RMP అసోసియేషన్ ప్రెసిడెంట్, ఉషోదయ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నిర్వాహకుడు యాదగిరి డాక్టరు అని పేర్కొంటూ, ప్రెస్క్రిప్షన్స్ రాస్తూ చట్ట విరుద్ధంగా మందులు రాస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు.డిస్టిల్ వాటర్ వయల్స్ ని వందల సంఖ్యలో నిల్వ ఉంచి వాటినే సూది మందులాగ ఇస్తున్నట్లు వెల్లడించారు. వాటితో పాటు యాంటిబయోటిక్ ఇంజెక్షన్స్, స్టెరాయిడ్ ఇంజెక్షన్లను రోగులకు వాడుతున్నట్టు తగు ఆధారాలు సేకరించినట్లు చెప్పారు.

మరోవైపు ఉప్పల్ ప్రాంతంలో బీరప్ప గూడా వద్ద నకిలీ వైద్యుడు బి. శ్రీను డాక్టర్ అని పేర్కొంటూ మందుల ప్రెస్క్రిప్షన్ రాస్తుననట్లు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు గుర్తించారు. వందల సంఖ్యలో నొప్పి నివారణ శాంపుల్స్, పిల్లలకు వాడే యాంటిబయోటిక్స్ సిరప్ లు, స్టెరాయిడ్ వయోల్స్ డ్రగ్ కంట్రోల్ అథారిటీ నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా VIEE LAC గ్రూప్ హెల్త్ కేర్ ఏజెన్సీ, బోడుప్పల్ నుంచి చట్ట విరుద్ధంగా తీసుకోచ్చి నిల్వ ఉంచి వాడుతున్నట్టు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. సదరు మెడికల్ ఏజెన్సీ పైన డ్రగ్ కంట్రోల్ కంట్రోల్ కమీషనర్ కమల్ హాసన్ రెడ్డికి వెంటనే ఫిర్యాదు చేశామని వెల్లడించారు. 

అదే ప్రాంతంలో బాలాజీ ఫస్ట్ ఎయిడ్ నిర్వాహకుడు తురగా నాగేశ్వర్ రావ్.. నొప్పి నివారణ ఇంజెక్షన్స్, ఇతర షెడ్యూల్ మందులు చట్ట విరుద్ధంగా ఆశాస్త్రీయంగా పేషెంట్లకు ఇస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. డా.నర్సింహా చారికి నోటీసు ఇవ్వడం తో పాటు నకిలీ వైద్యుడు ఆవంచ సురేష్ పై కేసు నమోదు చేయనున్నట్లు చెప్పారు. మెడికల్ స్టోర్ లైసెన్స్ లేకున్నా నకిలీ వైద్యులకు , అనుమతి లేని క్లినిక్ లకు బోడుప్పల్ లోని మెడికల్ ఏజెన్సీలు మందులు సప్లై చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. బీరప్పగుడాలో అనుమతి లేని మరో డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకులైన ల్యాబ్ టెక్నీషియన్స్ పైన కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *