RCB Felicitation Event: ఆర్సీబీ విక్టరీ సెలబ్రేషన్స్.. తొక్కిసలాటలో ఏడుగురు మృతి

ఏడుగురుఐపీఎల్ ట్రోఫీ(IPL Trophy 2025) నెగ్గిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)కి అభిమానులు నీరాజనం పడుతున్నారు. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన రజత్ పాటీదార్ సేన తొలి టైటిల్ అందివ్వడంతో ఫ్యాన్స్ ఆనందంలో తడిసిముద్దవుతున్నారు. ఈ మేరకు నిన్న ట్రోఫీ నెగ్గిన ఆర్సీబీ ఇవాళ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం(Chinnaswamy Stadium)లో విజయోత్సవాలను నిర్వహిస్తామని తెలిపిన విషయం తెలిసిందే. అయితే తొలుత బెంగళూరు విధాన సౌధ నుంచి స్టేడియం వరకూ ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించింది. ఆ తర్వాత చిన్నస్వామి స్టేడియంలో విక్టరీ సెలబ్రేషన్స్ ప్లాన్ చేశారు.

భారీగా తరలివచ్చిన ఆర్సబీ ఫ్యాన్స్

ఆర్సీబీ 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ట్రోఫీ నెగ్గి విజయగర్వంతో సొంతగడ్డపై అడుగుపెట్టిన ఆర్సీబీ ప్లేయర్లకు ఫ్యాన్స్‌ ఘన స్వాగతం పలికారు. కర్ణాటక డిప్యూటీ సీఎం DK శివకుమార్ స్వయంగా ఎయిర్ పోర్టుకు వెళ్లి బెంగళూరు టీమ్‌కు స్వాగతం పలికారు. విరాట్ కోహ్లీ, కృనాల్ పాండ్య, టిమ్ డేవిడ్, దినేశ్‌ కార్తిక్‌లకు ఆయన పుష్పగుచ్ఛం అందించి వెల్‌కమ్ చెప్పారు. అనంతరం బెంగళూరు జట్టు ప్రత్యేక బస్సులో విధాన సౌధకు చేరుకుంది. ఈ క్రమంలో వేలాది అభిమానులు ఆర్సీబీ జెండాలు చేతబూని విధాన సౌధ వద్దకు చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా ‘ఎర్రసముద్రాన్ని’ తలపించింది.

25 మందికి గాయాలు.. ఆరుగురి పరిస్థితి విషమం

అటు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద కూడా భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ‘ఆర్సీబీ’, ‘ఆర్సీబీ’ అంటూ నినాదాలు చేసి సందడి చేస్తున్నారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇందులో ఏడుగురు మరణించినట్లు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా బెంగళూరు’ తెలిపింది. మరో 25 మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొంది. కాగా ఆర్సీబీ ప్లేయర్లు స్టేడియానికి వస్తున్నారన విషయం తెలుసుకొని అభిమానులు ఒక్కసారిగా పోటెత్తారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ప్రస్తుతం చిన్నస్వామి పరిసరాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *