IPL హిస్టరీలోనే బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్(RCB) ఫస్ట్ టైం ట్రోఫీ నెగ్గింది. 2008లో టోర్నీ ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటి వరకూ ఆ జట్టుకు కప్ అందని ద్రాక్షలాగే మిగిలింది. ఈసారి ఎట్టకేలకు ఆ జట్టు తమ చిరకాల కోరిక నెరవేర్చుకుంది. ఫైనల్లో పంజాబ్ కింగ్స్(PBKS)ను 6 పరుగుల తేడాతో ఓడించి సగర్వంగా ట్రోఫీ(Trophy)ని ముద్దాడింది. దీంతో ఆ జట్టు అభిమానులు(Fans) దిక్కులు పిక్కటిల్లేలా సంబరాలు చేశారు. ఇందులో సినీ ప్రముఖులు, రాజకీయ నేతలతో పాటు ఏకంగా మ్యాచ్ చూడటానికి ఇంగ్లండ్ నుంచి బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్(Rishi Sunak) దంపతులు కూడా అహ్మదాబాద్‌కు వచ్చారంటే అర్థమవుతోంది. ఈ జట్టుపై ఉన్న అభిమానం, ఆ జట్టుకు ట్రోఫీ ఎంత విలువైందో.
ఆనందంతో చిన్నపిల్లాడిలా..
ఇలా అభిమానుల నుంచి మొదలు సినీ సెలబ్రిటీల వరకు అందరూ సంబరాలు చేసుకున్నారు. తమ భావోద్వేగాలను పంచుకుంటూ సోషల్ మీడియా(Social Media) వేదికగా వీడియోలను షేర్ చేస్తున్నారు. ఇక, భారీ తెరపై మ్యాచ్‌ను వీక్షించిన ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Director Prashanth Neel) సైతం ఆర్సీబీ విజయాన్ని ఫుల్‌గా ఎంజాయ్ చేశాడు. సినిమా సెట్‌లోనే పెద్ద స్ర్రీన్ ఏర్పాటు చేసి మ్యాచ్ చూసిన నీల్.. బెంగళూరు విజయం సాధించిన వెంటనే ఆనందంతో చిన్నపిల్లాడిలా ఎగిరి గంతేలేశాడు. ఆయన సెలబ్రేషన్స్ చేసుకున్న వీడియోను ఆయన భార్య సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతోంది.
Director #PrashanthNeel at #NTRNeel sets in RFC ❤️❤️
As King Kohli finally lifts his first IPL trophy,
the other King 👑 @tarak9999, is getting ready to create magic on screen 💥
What a great moment to witness!#RCB #IPLFinals #KingKohli #NTRNeelpic.twitter.com/0mrNRjUAPx— Milagro Movies (@MilagroMovies) June 3, 2025
అల్లు అయాన్ ఎమోషనల్.. RCBకి బన్నీ కంగ్రాట్స్
దీనికి ఆమె ‘ఈసాలా కప్ నమ్‌దు. 18 ఏళ్ల కల నెరవేరింది. క్రేజియెస్ట్ క్రికెట్ ఫ్యాన్ ప్రశాంత్ నీల్‌కు ఇది పర్ఫెక్ట్ గిఫ్ట్” అంటూ ఆమె రాసుకొచ్చారు. ఈరోజు (జూన్ 4) ప్రశాంత్ నీల్ బర్త్‌డే కూడా కావడంతో ఆ ఆనందం రెట్టింపు అయింది’ అని పేర్కొన్నారు. మరోవైపు అల్లు అర్జున్(Allu Arjun) కుమారుడు అల్లు అయాన్(Allu Ayaan) సైతం ఫుల్ ఎమోషనల్ అయ్యాడు. ఆ వీడియోను బన్నీ ఎక్స్‌లో పోస్టో చేశాడు. అలాగే RCBకి కంగ్రాట్స్ చెప్పాడు.
View this post on Instagram






