
థియేటర్లను అద్దె ప్రాతిపదికన(Theaters on rental basis) మీద కాకుండా, పర్సంటేజ్(Percentage)ల లెక్కన నడపాలనే వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది. ఇప్పటికే ఈస్ట్, కృష్ణా, సీడెడ్, నైజాంల్లో ఈ నినాదం ఊపు అందుకుంది. దీంతో రెండు రాష్ట్రాల ఎగ్జిబిటర్ల(Exhibitors)తో ఫిలిం ఛాంబర్(Film Chamber) ఈ నెల 18న కీలక సమావేశం(Key meeting) నిర్వహించబోతోంది. ఈ నేపథ్యంలో ఎగ్జిబిటర్ల వెనుక ఉండి ఆడిస్తున్న పెద్ద మనుషుల ఆట కట్టించాలనే ఆలోచనతో యాక్టివ్ నిర్మాతలు(Active Producers) కొందరు ప్రతి వ్యూహాలు రచించడం ప్రారంభించారు.
వారే కొత్త సిస్టమ్‌కు రెచ్చగొడుతున్నారా?
ఇక్కడ విషయం ఏమిటంటే దగ్గుబాటి సురేష్ బాబు(Daggubati Suresh Babu), ఆసియన్ సునీల్, దిల్ రాజు(Dill Raju)/శిరీష్ కలిసి ఎగ్జిబిటర్లను ఉసిగొల్పి, పర్సంటెజ్ సిస్టమ్‌కు రెచ్చగొడుతున్నారని యాక్టివ్ నిర్మాతలు అనుమానిస్తున్నారు. పర్సంటేజ్ సిస్టమ్ వస్తే పుష్ప(Pushpa) లాంటి భారీ సినిమాలకు కనీసం పది నుంచి ఇరవై కోట్లు నిర్మాతలకు నష్టం వస్తుందని అంటున్నారు. అదే నైజాంలో నలభై కోట్లు వసూలు చేసే సినిమాకు కనీనం ఏడెనిమిది కోట్లు నష్టం వస్తుందని నిర్మాతలు అంటున్నారు.
దిల్ రాజుకు బ్రేక్ వేసేందుకు
థియేటర్లు రన్ చేయలేకపోతున్నామని, పెద్ద సినిమాలకు రెంట్లు అంటున్నారని, రెండు వారాలు కాగానే షేరింగ్ మీద ఆడమంటున్నారని, ఇది కరెక్ట్ కాదు కదా అని ఎగ్జిబిటర్లు అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో పర్సంటేజ్ విధానానికి మద్దతు ఇస్తున్న శిరీష్/దిల్ రాజుకు బ్రేక్ వేయడానికి, మైత్రీ సంస్థతో చేతులు కలిపేందుకు సితార సంస్థ సిద్దం అవుతోందని సినీ వర్గాలు పేర్కొన్నాయి.