Budget 2025-26: తగ్గనున్న మెడిసిన్స్ ధరలు.. టూరిజంపై ఫోకస్

కేంద్ర బడ్జెట్ (Union Budget 2025-26)కి సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Finance Minister Nirmala Sitharaman) పలు కీలక అంశాల్లో మధ్యతరగతి ప్రజలకు(For middle class people) ఊరట కల్పిస్తూ కొత్త స్కీములను ప్రకటించారు. ముఖ్యంగా రైతులు, యువత, మహిళలు, వైద్యరంగానికి పెద్దపీట వేశారు. ఇందులో భాగంగా క్యాన్సర్(Cancer), అరుదైన వ్యాధులు, ఇతర తీవ్రమైన వ్యాధులకు సంబంధించి 36 ప్రత్యేక మందులపై బేసిక్ కస్టమ్ డ్యూటీ(Basic Custom Duty) పూర్తిగా తొలగిస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. అందువల్ల ఈ మందుల ధరలు (Medicines Rates) భారీగా తగ్గనున్నాయి. అందువల్ల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే రోగులకు ఈ నిర్ణయం కొంత ఊరటగా ఉంటుంది. అలాగే కన్సెషనల్ కస్టమ్స్ డ్యూటీ ఉన్న 6 లైఫ్ సేవింగ్ మందులపై ఉన్న కస్టమ్స్ డ్యూటీని కూడా పూర్తిగా తొలగిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

ఇకపై మహిళలకు సులభంగా రుణాలు

ఇక మహిళల(Womens)కు సులభంగా రుణాలు అందుబాటులో ఉండేలా.. కొత్త స్కీమ్(New Scheme) తీసుకువస్తామని నిర్మలమ్మ ప్రకటించారు. ఐదేళ్ల టెన్యూర్‌లో టర్మ్ లోన్స్(Term Loans in Tenure) అందిస్తామని వెల్లడించారు. దీని వల్ల 5లక్షల మంది మహిళలకు ఊరట లభించనుందని తెలిపారు. SC, ST మహిళలకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం టూరిజం(Tourism) రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు దేశవ్యాప్తంగా 50టూరిస్ట్ ప్లేస్‌లను ప్రత్యేకంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఆయా టూరిస్ట్ ప్రాంతాల్లో టూరిస్టులకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలూ కల్పిస్తామని చెప్పారు. భారీ ఎత్తున హోటళ్ల(Hotels)ను ఏర్పాటు చేయిస్తామన్నారు. టూరిజం అభివృద్ధి ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు(Employment opportunities) పెంచాతామనీ, స్కిల్ కూడా డెవలప్ చేస్తామని మంత్రి తెలిపారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *