Budget 2025-26: నేడే కేంద్ర బడ్జెట్.. అందరి చూపు నిర్మల వైపే!

కేంద్ర ప్రభుత్వం నేడు(ఫిబ్రవరి 1) పార్లమెంట్‌(Parliament)లో బడ్జెట్ 2025-26(Central Budget 2025-26) ప్రవేశపెట్టనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Union Finance Minister Nirmala Sitharaman) రికార్డు స్థాయిలో 8వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీంతో ఇవాళ ఆర్థిక మంత్రి ఎలాంటి ప్రకటనలు చేస్తారోనని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు(Middle class people) తమ ఆర్థిక భారాన్ని తగ్గించి, జీవన నాణ్యతను మెరుగుపరిచే ఉపశమన చర్యలు ఏమైనా ఉంటాయా అని చూస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా పేర్కొనే మిడిల్ క్లాస్.. ఇటీవల అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ధరలు, జీవన వ్యయాలు ఆర్థిక భారం మోపుతుండగా, వేతనాలు మాత్రం పెరగడం లేదు.

ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ శ్లాబ్‌లలో సవరణ చేస్తారా?

అయితే జనవరి 31న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (President Draupadi Murmu) ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను సమర్పించారు. GDP వృద్ధి, ద్రవ్యోల్బణం, ఉపాధి, ఇతర కీలక సూచికలపై కీలక సమాచారం అందించారు. కాగా బడ్జెట్‌లో ట్యాక్స్‌ శ్లాబ్‌ సవరణలు ఎగ్జమ్షన్‌ లిమిట్‌ పెంచడమే కాకుండా, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌(Income Tax) శ్లాబ్‌లలో సవరణ ఆశిస్తున్నారు. మధ్య-ఆదాయ వర్గాలకు ఆర్థిక ఉపశమనం కల్పించేలా తక్కువ పన్ను రేట్లు విధించాలని కోరుతున్నారు. కొత్త పన్ను విధానంలో రూ.3- రూ.7 లక్షలు మధ్య సంపాదిస్తున్న వ్యక్తులకు పన్ను రేటు తగ్గించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

UNION BUDGET 2023-2024: కేంద్ర బడ్జెట్ పై ఆంధ్రప్రదేశ్ గంపెడాశలు; ఈసారైనా  కేంద్రం కరుణిస్తుందా? | UNION BUDGET 2023-2024: Andhrapradesh hopes on  union budget, huge expectations on ...

ఉద్యోగాల కల్పనపై ప్రకటన ఉంటుందా..

ఆదాయ పన్ను ఉపశమనం బడ్జెట్‌(Budget)లో అందరూ కోరుకుంటున్న మార్పు ఆదాయ పన్ను మినహాయింపు. కొత్త పన్ను విధానంలో Section 80C, 80D, 10(13A) వంటి డిడక్షన్‌లు చేర్చాలని కూడా సూచిస్తున్నారు. ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధి మధ్యతరగతి ప్రజలకు నిరుద్యోగం(Unemployment) ప్రధాన ఆందోళనగా మిగిలిపోయింది. మౌలిక సదుపాయాలు, తయారీ, సాంకేతిక రంగాల్లో పెట్టుబడులు(Investments) పెట్టడం ద్వారా ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని భావిస్తున్నారు. వివిధ పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు సృష్టించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *