
ఖమ్మం జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పత్తి మార్కెట్ లో అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. మార్కెట్ యార్డు షెడ్డులో పత్తి బస్తాలు తగులబడుతున్నాయి. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక బృందాలతో ఘటనాస్థలికి చేరుకున్నాయి.
400 పత్తి బస్తాలు దగ్ధం
విషయం తెలుసుకున్న స్థానికులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు అగ్నిమాపక దళాలు కూడా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే 400కి పైగా బస్తాలు కాలిపోయినట్లు సమాచారం. ఖరీదు చేసిన పత్తి మంటల్లో కాలి పోవడంతో వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు కాంటాకు తెచ్చిన పత్తి బస్తాలు (Cotton Crop) దగ్ధం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు.