
హైదరాబాద్(Hyderabad)లో ఇవాళ (మే 18) తీవ్ర విషాదం నెలకొంది. మహానగరంలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో భారీ అగ్ని ప్రమాదాలు(Fire Accidents) కలకలం రేపాయి. ఇవాళ ఉదయం చార్మినార్ సమీపంలో గుల్జార్‌హౌస్(Gulzar House)లో జరిగిన ప్రమాదంలో 17 మంది సజీవ దహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అటు మైలార్‌దేవ్‌పల్లి(Mailardevpally)లో జరిగిన మరో ఫైర్ యాక్సిడెంట్‌లో దాదాపు 53 మందిని ఫైర్ సిబ్బంది(Fire Fighters) సురక్షితంగా రక్షించారు. ఈ రెండు ఘటనలతో భాగ్యనగర వాసులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
17 lives lost, including children in tragic fire at a G+2 building near Gulzar House, Charminar.
Telangana Fire Dept rescued 17 others trapped inside.
12 fire appliances, 70 personnel & advanced robots deployed. Cause under investigation. pic.twitter.com/YqIXkqqzhI
— Naveena (@TheNaveena) May 18, 2025
తప్పిన పెను ముప్పు..
నగర శివార్లలోని మైలార్‌దేవ్‌పల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. ఇక్కడ ఒక మూడంతస్తుల భవనం(G+3 floor + Pent house)లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో భవనంలో సుమారు 53 మంది నివసిస్తున్నారు. భవనం నుంచి కిందకు దిగే ప్రధాన మెట్ల మార్గం(Main Root) వద్దే మంటలు భారీగా ఎగిసిపడటం(Fire Breaks)తో వారంతా పైఅంతస్తుల్లో చిక్కుకుపోయారు. ప్రాణభయంతో టెర్రస్‌పైకి చేరుకుని ఆర్తనాదాలు చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్ల(Fire Engines)తో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించి, లాడర్ల సహాయంతో టెర్రస్‌పై ఉన్నవారిని సురక్షితంగా కిందకు దించారు.
Fire Accident in Mailardevpally, Ranga Reddy District
Flames erupted in a three-storey building, causing panic among residents. Out of fear for their lives, people rushed to the terrace. Fire department personnel reached the spot in time and safely rescued everyone.… pic.twitter.com/warJHle9T1— Hyderabad Mail (@Hyderabad_Mail) May 18, 2025
ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతోనే..
అటు రెండో అంతస్తులో చిక్కుకున్న మరికొందరిని మెట్ల మార్గం ద్వారా కిందకు తీసుకొచ్చారు. అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి, భవనంలో చిక్కుకున్న మొత్తం 53 మందిని ప్రాణాలతో కాపాడారు. వీరిలో 20 మంది చిన్నపిల్లలు కూడా ఉండటం గమనార్హం. సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తేవడంతో పెను ప్రమాదం తప్పిందని, అందరూ ఊపిరి పీల్చుకున్నారు.