హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీలో భారీ అగ్నిప్రమాదం(Fire Accident) జరిగింది. చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్(Gulzar House)లో ఆదివారం ఉదయం ఒక్కసారిగా అగ్నికీలలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది(Firefighters) 10 ఫైర్ ఇంజిన్లతో తక్షణమే అక్కడికి చేరుకొని మంటలు ఆర్పేశారు. ఈ ప్రమాదంలో 16 మరణించగా మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ముగ్గురు మహిళలున్నారు. మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి.
ప్రమాదంలో మృతి చెందిన వారు వీరే..
ఈ ఘటనలో అగ్నికీలలతోపాటు దట్టంగా పొగ కమ్మేయడంతో 20 మంది వరకూ స్పృహ కోల్పోయారు. కాగా క్షతగాత్రులను ఉస్మానియా, యశోద (మలక్‌పేట), డీఆర్డీవో అపోలో ఆస్పత్రులకు తరలించారు. ప్రస్తుతానికి మృతులు రాజేంద్రకుమార్ (67), అభిషేక్ మోదీ (30), సుమిత్ర (65), అర్షాదీ గుప్తా (7), మున్నీబాయి (72), ఆరుషి జైన్ (17), శీతల్ జైన్ (37), ఇరాజ్ (2)గా పోలీసులు గుర్తించారు. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు.
A major fire broke out in a residence behind Ikram Jewellers near Gulzar Houz, Charminar. Several victims, including children, were affected. Emergency services and locals responded swiftly, shifting victims to nearby hospitals. Rescue operations are ongoing.#Hyderabad pic.twitter.com/sw1x7yJh45
— Habeeb Masood Al-Aidroos (@habeeb_masood) May 18, 2025
సీఎం రేవంత్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి
అగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 16 మంది మృతి చెందడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar)ను అడిగి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. అటు ఘటనాస్థలాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(Union Minister Kishan Reddy) పరిశీలించారు. అధికారులతో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు కేంద్రం తరఫున సాయం అందిస్తామని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.






