
టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ (Fish Venkat, 53) తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. కిడ్నీ సంబంధిత(Kidney Failure) వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఆర్బీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. రెండు కిడ్నీలూ చెడిపోవడంతో డయాలసిస్(Dialysis) కోసం కుటుంబ సభ్యులు ఆయన్ను కొన్ని రోజుల కిందట ఆస్పత్రిలో చేర్చారు. రెండు కిడ్నీలు మార్పిడి చేయాలని వైద్యులు తెలిపారని ఆయన కుమార్తె ఇటీవల మీడియాకు వెల్లడించిన విషయం తెలిసిందే. వైద్యసేవలు పొందలేని దీనస్థితిలో ఉన్నామని, దాతలు ఎవరైనా సాయం చేయాలని ఆమె కోరారు. ఇంతలోనే ఆయన మృతి చెందడం విచారకరం.
1989లో ఓ మిత్రుడి ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ
కాగా ఫిష్ వెంకట్‌కు ఇద్దరు భార్యలు. ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. ఫిష్ వెంకట్ అసలు పేరు మంగలంపల్లి వెంకటేశ్(Mangalampally Venkatesh). హైదరాబాదులో పుట్టి పెరిగాడు. ఈయన కేవలం 3వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. మొదట్లో ముషీరాబాద్, రాంనగర్‌లోని చేపల మార్కెట్(Ramnagar Fish Market)లో చేపల వ్యాపారం చేసేవాడు. దానితో అందరూ ఫిష్ వెంకట్ అని పిలిచేవారు. వెంకట్‌ను సినీ పరిశ్రమకు తన మిత్రుడైన శ్రీహరి(Srihari) ద్వారా వచ్చాడు. 1989లో ఓ మిత్రుడి ద్వారా ఆయనకు దివంగత నిర్మాత మాగంటి గోపినాథ్(Maganti Gopinath) పరిచయమ్యారు. ఆయన 1991లో నిర్మించిన ‘జంతర్ మంతర్’ చిత్రంలో వెంకట్‌కు తొలిసారి నటించే అవకాశం వచ్చింది.
Mis u Fish Venkat Anna 🥺 pic.twitter.com/Tvg8qxy8jg
— Raviteja Pavan (@RavitejaPavan1) July 18, 2025
ఫిష్ వెంకట్ చివరి చిత్రం ‘కాఫీ విత్ ఏ కిల్లర్’
అయితే అప్పట్లో పెద్దగా గుర్తింపు రాకపోయిప్పటికీ నటనపై ఆసక్తితో సినిమాల్లో కొనసాగారు. ఆ తర్వాత దర్శకుడు వి.వి.వినాయక్(VV. Vinayak) ఇతడిని తెలుగు చిత్రసీమకు పరిచయం చేశాడు. వెంకట్ వి.వి.వినాయక్ ని సినీ పరిశ్రమలో తన గురువుగా భావిస్తాడు. దాదాపు వందకుపైగా చిత్రాల్లో నటించాడు. వెంకట్ చాలా చిత్రాల్లో హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీప్రియులను అలరించారు. ఆది, దిల్, బన్నీ, అత్తారింటికి దారేది, లక్ష్మీ, చెన్నకేశవరెడ్డి, గబ్బర్‌సింగ్, DJ టిల్లు, కింగ్(King), డాన్ శీను, మిరపకాయ్, దరువు, సుప్రీమ్ తదితర హిట్ చిత్రాల్లో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన చివరి చిత్రం ‘కాఫీ విత్ ఏ కిల్లర్’. కాగా దివంగత నటుడు శ్రీహరి తనను ఎంతో ప్రోత్సహించారని, ఆయనతో తనకు ఎంతో అనుబంధం ఉండేదని వెంకట్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
#Tollywood actor and popular comedian #FishVenkat (#VenkatRaj) passed away on July 18 in a private hospital in #Hyderabad. He was 53 years old. Fish Venkat had been suffering from serious health issues due to kidney failure for the past several months. He had been undergoing… pic.twitter.com/Wgq2ZvoPuq
— BNN Channel (@Bavazir_network) July 18, 2025