నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయం(Srisailam Reservoir) ఎగువ ప్రాంతాలైన కర్ణాటక, మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల(Heavy Rains) కారణంగా నిండుకుండలా మారింది. జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరడంతో జలాశయ నీటిమట్టం 885 అడుగుల పూర్తి సామర్థ్యానికి చేరుకుంది. ప్రస్తుతం ఎగువ నుంచి 2,32,290 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. ఐదు గేట్లు, కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా.. 2,01,743 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో జలాశయంపై ఒత్తిడిని తగ్గించేందుకు అధికారులు ఐదు గేట్లను ఎత్తి నాగార్జునసాగర్(Nagarjuna Sagar)కు నీటిని విడుదల చేశారు.

భారీ వర్షాలు కొనసాగితే మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం
కాగా జలాశయం పూర్తి స్థామర్థ్యం 215.81 TMCలు కాగా ప్రస్తుతం 180 TMCలకు పైగా నీటిని నిల్వ నమోదైంది. ఐదు గేట్లను ఒక్కొక్కటి 10 అడుగుల ఎత్తు మేర ఎత్తారు. ఇది దిగువ ప్రాంతాలకు నీటి సరఫరాకు, విద్యుత్ ఉత్పత్తికి దోహదపడుతుంది. ఈ విడుదల వ్యవసాయదారులకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని రైతులకు ఊరటనిచ్చే అంశం. అయితే, భారీ వర్షాలు కొనసాగితే మరిన్ని గేట్లను ఎత్తివేయాల్సి రావచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. గేట్ల నుంచి నీరు ఉధృతంగా ప్రవహించే దృశ్యం చూడటానికి శ్రీశైలం సమీపంలోని సుందీపెంట, ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు(Tourists) అక్కడికి తరలివెళ్తున్నారు. అధికారులు భద్రతా చర్యలను పెంచారు. ఘాట్ రోడ్డుపై ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులను నియమించారు.
Beautiful view of Srisailam project. pic.twitter.com/bWqFZe5J8k
— Tharun Reddy (@Tarunkethireddy) July 28, 2025






