
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ(Director Atlee) కాంబినేషన్‌లో రాబోతున్న పాన్-ఇండియా చిత్రం ‘AA22xA6’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సన్ పిక్చర్స్(Sun Pictures) నిర్మాణంలో, హాలీవుడ్ రేంజ్ విజువల్స్‌తో సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి తాజా అప్‌డేట్ సినీ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో పాటు ఏకంగా ఐదుగురు హీరోయిన్లు నటించనున్నారని సమాచారం.
రూ.800 కోట్ల భారీ బడ్జెట్‌తో..
సినీవర్గాల్లో వస్తున్న వార్తల మేరకు.. బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె(Deepika Padukone) ప్రధాన కథానాయికగా నటిస్తుండగా, జాన్వీ కపూర్(Janhvi Kapoor), మృణాల్ ఠాకూర్(Mrinal Thakur), రష్మిక మందన్న(Rashmika Mandanna), భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse) ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ ఐదుగురు హీరోయిన్ల ఎంపికతో సినిమా గ్లామర్, ఎమోషనల్ డెప్త్‌ను మరింత పెంచాలని అట్లీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో నలుగురు హీరోయిన్లు.. సెకండ్ హాఫ్‌లో పరిచయం అవుతారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఈ చిత్రం 800 కోట్ల భారీ బడ్జెట్(Big budget)తో రూపొందుతుండటం విశేషం.
టైమ్ ట్రావెల్ ఆధారంగా..
కాగా ‘Pushpa 2’తో రూ.1850+ కోట్ల కలెక్షన్స్‌తో రికార్డులు సృష్టించిన అల్లు అర్జున్, అట్లీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జవాన్(Jawan)’తో రూ.1000 కోట్లు రాబట్టిన సత్తాతో ఈ కాంబినేషన్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. లాస్ ఏంజెల్స్‌లోని ప్రముఖ వీఎఫ్‌ఎక్స్ స్టూడియోలో చిత్రీకరణ జరుగుతుండగా, ఈ సినిమా టైమ్ ట్రావెల్ ఆధారంగా రూపొందుతున్నట్లు సమాచారం. ఈ ఏడాది జూన్‌లో షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
👉Lead Actor : #AlluArjun
👉Lead Actresses : #DeepikaPadukone, #JahnviKapoor, #MrunalThakur, #RashmikaMandanna & #BhagyashriBorse
👉Lead Antagonist : #WillSmith
👉Director : #Atlee
👉Music : #SaiAbhyankkar
👉Budget : 800 Crores
— Breaking News (@BreakingNews343) July 9, 2025