Mana Enadu : హైదరాబాద్ మహానగరం న్యూ ఇయర్ (New Year 2025) వేడుకలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కొత్త ఏడాది వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆంక్షలు విధించారు. డిసెంబరు 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఐటీ కారిడార్‌లో ఫ్లై ఓవర్లను (Fly Overs) మూసివేయనున్నట్లు తెలిపారు.
వాటికి మాత్రమే అనుమతి
ఓఆర్‌ఆర్‌పై భారీ వాహనాలు, ఎయిర్ పోర్టు (Air Ports)కు వెళ్లే వాహనాలను మాత్రమే అనుమతిస్తామని పోలీసులు తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ కెమెరాలను ఏర్పాటు చేశాం. సిగ్నల్ జంపింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవు. ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతాం. మద్యం సేవించిన వారికి పబ్‌లు, బార్ల యాజమానులు ప్రైవేటు వాహనాలు, డ్రైవర్లను అందుబాటులో ఉంచాలి. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు ఉంటాయి. అని పోలీసులు హెచ్చరించారు.
31న ఫ్రీ ప్రయాణం
మరోవైపు న్యూ ఇయర్ వేడుకల దృష్ట్యా డిసెంబరు 31వ తేదీ రాత్రి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు తెలంగాణ ఫోర్ వీలర్స్ సంఘం (Telangana Forum Wheelers Association) వెల్లడించింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించనున్నట్లు తెలిపింది. 500 కార్లు, 250 క్యాబ్‌లు అందుబాటులో ఉంటాయని.. ప్రజలు మద్యం మత్తులో వాహనాలు నడపొద్దని, రోడ్డు ప్రమాదాలు జరగకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.







