ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, ఝార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) వ్యవస్థాపకుడు శిబూ సోరెన్(Shibu Soren, 81) సోమవారం (ఆగస్టు 4) ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన గత కొన్ని వారాలుగా మూత్రపిండ సంబంధిత వ్యాధి(Renal related disease)తో బాధపడుతూ వెంటిలేటర్ సహాయంతో చికిత్స పొందుతున్నారు. ఆయన మరణ వార్తను ఆయన కుమారుడు, ప్రస్తుత ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్(Jharkhand Chief Minister Hemant Soren) సోషల్ మీడియా ద్వారా ధ్రువీకరించారు. హేమంత్ సోరెన్ తన సందేశంలో “గౌరవనీయ దిశోమ్ గురూజీ మమ్మల్ని విడిచి వెళ్లిపోయారు. నేను ఈ రోజు శూన్యమయ్యాను” అని భావోద్వేగంతో తెలిపారు.
మూడు సార్లు ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా..
కాగా శిబూ సోరెన్ ఆదివాసీ నాయకుడిగా, ఝార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు(Formation of Jharkhand state) కోసం నిరంతరం పోరాడిన ప్రముఖ నేత. 1972లో JMM స్థాపనలో కీలక పాత్ర పోషించిన ఆయన, ఆదివాసీ హక్కుల కోసం, భూమి సంస్కరణల కోసం జీవితాన్ని అంకితం చేశారు. ఆయన దుమ్కా నియోజకవర్గం నుంచి ఎనిమిది సార్లు లోక్‌సభకు, రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. మూడు సార్లు ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా, మూడు సార్లు కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా సేవలందించారు. ఆయన సామాజిక న్యాయం, ఆదివాసీ సంక్షేమం కోసం చేసిన కృషి ఝార్ఖండ్ రాజకీయ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది.శిబూ సోరెన్ మరణంతో ఝార్ఖండ్‌లో శోకం అలుముకుంది. రాజకీయ నాయకులు, ఆదివాసీ సముదాయాలు ఆయనను “దిశోమ్ గురుజీ”గా స్మరించుకుంటూ నివాళులర్పిస్తున్నారు.
#BREAKING | Former Jharkhand CM Shibu Soren No More
– Shibu Soren dies at the age of 81. #ShibuSoren #Jharkhand #BreakingNews pic.twitter.com/uRRsXyng6v
— TIMES NOW (@TimesNow) August 4, 2025






