Mana Enadu : అనారోగ్యంతో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచిన భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh) అంత్యక్రియలు ముగిశాయి. దిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో ఆయన పార్థివదేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు (Final Rites) జరిగాయి . కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మన్మోహన్ సింగ్ పాడె మోశారు. అంతిమ యాత్రలో కాంగ్రెస్ అగ్రనేతలు సహా భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు.
ముర్ము, మోదీ హాజరు
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi), లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రియాంక గాంధీ, దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా హాజరై మాజీ ప్రధానికి కన్నీటి వీడ్కోలు పలికారు.
Former Prime Minister Manmohan Singh laid to rest
Read @ANI Story | https://t.co/J9iYXXP6gv#LastRites #ManmohanSingh #Cremation pic.twitter.com/PwlhKVbTWL
— ANI Digital (@ani_digital) December 28, 2024
అంతిమ వీడ్కోలు
త్రివిధ దళాల అధిపతులు మన్మోహన్‌కు నివాళులర్పించారు. అంత్యక్రియలకు దిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హాజరయ్యారు. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యల్ వాంగ్‌చుక్, విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు. అంతకుముందు ప్రజల సందర్శనార్థం మన్మోహన్ సింగ్ పార్థివదేహాన్ని ఆయన నివాసం నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. అక్కడ మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు.
వైద్యులు ప్రయత్నించినా
ఇక మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి దిల్లీలోని ఎయిమ్స్ లో కన్నుమూశారు. అనారోగ్యంతో గురువారం రాత్రి కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించగా వైద్యులు ఆయణ్ను కాపాడేందుకు తీవ్రంగా శ్రమించారు. కానీ ఆరోజు రాత్రే ఆయన తుదిశ్వాస విడిచారు. ఆస్పత్రి నుంచి ఆయన పార్థీవదేహాన్ని దిల్లీలోని ఆయన నివాసానికి తరలించారు.
#WATCH | Last rites of former Prime Minister #DrManmohanSingh performed with full state honours at Nigam Bodh Ghat in Delhi.
(Source: DD News) pic.twitter.com/P69QVWMSyd
— ANI (@ANI) December 28, 2024
ఇక సెలవు
అక్కడే శుక్రవారం అంతా ఉంచగా ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ సహా ఇతర పార్టీల నాయకులు మన్మోహన్ బౌతికకాయానికి నివాళులర్పించారు. శనివారం ఉదయం ప్రజల సందర్శనార్థం మన్మోహన్ పార్థివదేహాన్ని ఏఐసీసీ కార్యాలయానికి తరలించారు. అక్కడి నుంచి అంతిమయాత్రంగా నిగమ్‌బోధ్ ఘాట్ గా వెళ్లారు. సన్నిహితుల అశ్రునయనాల మధ్య ఆర్థిక సంస్కర్త పుడమి నుంచి సెలవు తీసుకున్నారు.






