మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ కన్నుమూత

Mana Enadu : మాజీ ప్రధాని, ఆర్థిక సంస్కర్త మన్మోహన్ సింగ్‌ (Manmohan Singh) (92) కన్నుమూశారు. అస్వస్థతతో గురువారం సాయంత్రం దిల్లీ ఎయిమ్స్​లో చేరిన ఆయనకు అత్యవసర విభాగంలో చికిత్స అందించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఎయిమ్స్​ ప్రకటన విడుదల చేసింది. మన్మోహన్‌ సింగ్‌ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

వారంపాటు సంతాప దినాలు

మన్మోహన్ సింగ్ మరణం నేపథ్యంలో దేశవ్యాప్తంగా 7 రోజులపాటు సంతాప దినాలు నిర్వహించాలని కేంద్ర సర్కార్ నిర్ణయించింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రివర్గ మండలి భేటీ అయి ఆయన మృతికి సంతాపం తెలపనుంది. శనివారం రోజున ప్రభుత్వ లాంఛనాలతో మన్మోహన్ అంత్యక్రియలు (Manmohan Singh Final Rites) జరగనున్నాయి. మరోవైపు మాజీ ప్రధాని మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇవాళ సెలవు ప్రకటించింది.

మన్మోహన్ బయోగ్రఫీ

మన్మోహన్ సింగ్ 1932లో సెప్టెంబరు 26వ తేదీన ప్రస్తుతం పాకిస్థాన్ లో ఉన్న పంజాబ్ లోని మాలో జన్మించారు. పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి 1952లో ఆర్థిక శాస్త్రంలో బీఏ పట్టా, 1954లో ఎంఏ పట్టా పొందారు. ఆ తర్వాత కేంబ్రిడ్జ్ నుంచి ఆర్థిక శాస్త్రంలో ట్రైపోస్, 1962లో ఆక్స్ ఫర్డ్ నుంచి ఎంఏడిఫిల్, హోనరిస్ కాసా నుంచి డి.లిట్ పట్టా పొందారు. 1958 సెప్టెంబరు 14న ఆయన గురుశరణ్ కౌర్ (Manmohan Singh Wife) ను వివాహమాడారు. వీరికి ఉపేందర్, దామన్ అమృత్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ఎన్నో పదవులు

భారతదేశ 13వ ప్రధానిగా మన్మోహన్‌ సింగ్ 2004-2014 మధ్య బాధ్యతలు చేపట్టారు. మన్మోహన్ 1982-85 మధ్య ఆర్బీఐ గవర్నర్‌గా, 1991-96 మధ్య పీవీ హయాంలో ఆర్థికమంత్రిగా సేవలందించారు.  ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఎల్‌పీజీ సంస్కరణలు ప్రవేశపెట్టారు. 1998-2004 మధ్య రాజ్యసభ ప్రతిపక్ష నేతగా వ్యవహరించాిన ఆయన 33 ఏళ్లు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. యూజీసీ ఛైర్మన్‌గా, ప్రణాళిక సంఘం డిప్యూటీ ఛైర్మన్‌గానూ డాక్టర్ మన్మోహన్ సింగ్ సేవలందించారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *