ఫార్ములా-ఈ కార్ రేసు కేసు((Formula E Race Case)లో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRకు భారీ ఊరట లభించింది. పది రోజుల వరకూ కేటీఆర్‌ను అరెస్టు చేయెుద్దని తెలంగాణ హైకోర్టు(TG Highcourt) ఆదేశాలు జారీ చేసింది. ACB తన దర్యాప్తును కొనసాగించవచ్చని హైకోర్టు తెలిపింది. డిసెంబర్ 30 లోగా ప్రభుత్వం కౌంటర్(Counter) దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 30కి వాయిదా వేస్తూ తీర్పు వెలువరించింది. తదుపరి విచారణను DEC 27కు వాయిదా వేసింది.
హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు
కాగా హైదరాబాద్ ఫార్ములా-ఈ కార్ రేస్ (Formula E Race) వ్యవహారంలో కేటీఆర్‌పై గురువారం ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ (KTR ACB Case) హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై తాజాగా హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కేటీఆర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుందరం, ప్రభాకర్‌రావు, గండ్ర మోహన్‌రావు హైకోర్టులో వాదనలు వినిపించారు.
ఆ సెక్షన్లు ఈ కేసుకు వర్తించవు
ఈ సందర్భంగా KTR తరఫు లాయర్ మాట్లాడుతూ.. అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిన సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని.. ముఖ్యంగా 13(1)(a) సెక్షన్ వర్తించదని అన్నారు. ఎన్నికల కోడ్ (Election Code) ఉల్లంఘించారని అనేందుకు ఆధారాలు లేవన్న ఆయన.. 14 నెలల తర్వాత FIR నమోదు చేశారని.. అది కూడా ప్రాథమిక విచారణ కూడా లేకుండా కేసు పెట్టారని కోర్టుకు తెలిపారు. కార్ రేస్ నిర్వహణకు 2022 అక్టోబరు 25న ఒప్పందం జరిగితే.. సీజన్ 10 నిర్వహణకు స్పాన్సర్ వెనక్కి తగ్గారని వెల్లడించారు.






