ఇంగ్లండ్ ఉమెన్స్ వర్సెస్ ఇండియా ఉమెన్స్(India-W vs England-W) మధ్య ఇవాళ నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. మాంచెస్టర్(Manchester)లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 11.30 గంటలకు ప్రారంభం కానుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకునే కీలక అవకాశం భారత్ ముందుంది. మొదటి T20లో ట్రెంట్ బ్రిడ్జ్‌లో భారత్ 97 పరుగుల తేడాతో ఘన విజయం సాధించగా, రెండో మ్యాచ్‌లో బ్రిస్టల్(Bristol)లో 24 పరుగుల తేడాతో గెలిచింది. స్మృతి మంధాన (112) మొదటి మ్యాచ్‌లో సెంచరీతో మెరిస్తే, జెమిమా రోడ్రిగ్స్ (63), అమంజోత్ కౌర్ (63*) రెండో మ్యాచ్‌లో అర్ధ సెంచరీలతో రాణించారు. బౌలింగ్‌లో శ్రీ చరణి 6 వికెట్‌లతో సత్తా చాటింది.
బౌలింగ్‌లో పటిష్ఠంగా ఇంగ్లండ్
అయితే, ఓవల్‌లో జరిగిన మూడో టీ20లో ఇంగ్లండ్(England) 5 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను సజీవంగా ఉంచింది. సోఫియా డంక్లీ (75), డానీ వైట్-హాడ్జ్ (66) ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో రాణించగా, లారెన్ బెల్ (3/27) బౌలింగ్‌లో మెరిసింది. ఈ మ్యాచ్‌లో భారత్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వంలో జట్టు బ్యాటింగ్, బౌలింగ్‌లో సమతూకం కాపాడాలని భావిస్తోంది. ఇంగ్లండ్ జట్టులో నాట్ సివర్-బ్రంట్(Nat Siever-Brunt) గాయం నుంచి కోలుకోలేని పరిస్థితిలో టామీ బ్యూమాంట్ నాయకత్వం వహిస్తోంది. సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ ఫిలర్‌లతో ఇంగ్లండ్ బౌలింగ్ పటిష్ఠంగా ఉంది. కాగా ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ తొలిసారి ఇంగ్లండ్ గడ్డపై తొలి టీ20 సిరీస్‌ను దక్కించుకోనుంది.
🏏 Match Prediction – England Women vs India Women | 4th T20I #engwvsindw
📍 4th T20I – England Women vs India Women
📅 July 09, Wednesday
🏟️ Emirates Old Trafford, Manchester
🕕 Match Time: 05:30 PM GMT | 06:30 PM LOCAL | 11:30 PM IST🔥 The series heats up as two power-packed… pic.twitter.com/2zfz1ogTU6
— Cricdiction (@cricdiction) July 8, 2025






