
మహిళలకు ఏపీ సర్కార్(AP Govt) తీపికబురు అందించింది.2025 ఆగస్టు 15 నుంచి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని(Free Bus Scheme For Womens) అమలు చేయనున్నట్లు కర్నూలు జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు(CM Chadrababu) ప్రకటించారు. ఈ స్కీము కోసం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. కర్నూల్ జిల్లాలో “స్వర్ణ ఆంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర(Swarnaandhra-Swacchaandhra)” కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఈ మేరకు ప్రకటన చేశారు. అలాగే వచ్చే విద్యాసంవత్సరం నుంచి “తల్లికి వందనం(Thalliki Vandanam)” కార్యక్రమాన్ని కూడా చేపడుతామని, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ఈ పథకం వర్తిస్తుందన్నారు.
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు
ఏపీలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కలిపిస్తున్నట్టు తెలిపిన సీఎం బాబు గారు ❤️🙏 pic.twitter.com/SzAeR2kKPv
— SURENDRA PILLELLA (@SURENDRAPILLEL1) May 17, 2025
రాయలసీమను హార్టికల్చర్‌గా అభివృద్ధి చేస్తాం..
అలాగే రైతుల(Farmers)కు కూడా కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు అదనంగా రూ.8 వేలు జతచేసి మొత్తం రూ.14 వేలు అకౌంట్లలో వేస్తామన్నారు. రాయలసీమను హార్టికల్చర్(Horticulture)గా అభివృద్ధి చేస్తామన్నారు. మహిళల సామాజిక, ఆర్థిక స్వాతంత్ర్యాన్ని ప్రోత్సహించడం, రవాణా ఖర్చులను తగ్గించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే ఉద్దేశంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించినట్లు CM వివరించారు. కాగా ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వస్తే రోజుకు సుమారు 25 లక్షల మంది మహిళలు ప్రయోజనం కలగనుంది. సీఎం ప్రకటనతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచం గర్వించేలా యోగా డే
ప్రపంచం గర్వించేలా జూన్ 21న విశాఖలో యోగా డే(Yoga Day) నిర్వహిస్తాం.. ప్రధాని మోదీ(PM Modi) కూడా వస్తున్నారు. యోగా డేను నెలరోజులపాటు నిర్వహిస్తాం. ప్రజలకు శిక్షణ ఇస్తాం. ప్రతి ఒక్కరూ రోజుకు అరగంట యోగా చేయాలని కోరుతున్నా. అక్టోబరు 2 నాటికి రాష్ట్రంలో ఎక్కడా చెత్త లేకుండా చూడాలని ఆదేశించా. చెత్త నుంచి విద్యుదుత్పత్తి చేస్తున్నాం.. రెండు ప్రాజెక్టులు పనిచేస్తున్నాయి. రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, కడపలోనూ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు.