అర్హులైన ప్రతి ST, ST కుటుంబాలకు 200 యూనిట్ల వరకు కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్(Free electricity)ను అందిస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్(Power Minister Gottipati Ravikumar) పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన అల్పాదాయ కుటుంబాలకు అందిస్తున్న ఉచిత విద్యుత్‌కు సంబంధించి మంత్రి గొట్టిపాటి బుధవారం వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది SC, ST కుటుంబాలు ఉచిత విద్యుత్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని తెలిపారు.
తప్పుడు రాతలపై ఆగ్రహం
కాగా రాష్ట్రంలో 15,17,298 SC కుటుంబాలు, 4,75,557 ST కుటుంబాలు ఉచిత విద్యుత్ పథకంలో లబ్ధిదారులు(Beneficiaries)గా ఉన్నారని మంత్రి స్పష్టం చేశారు. 19,92,855 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచిత విద్యుత్‌ను అందించే క్రమంలో కూటమి ప్రభుత్వం(Alliance Govt) నెలకు సుమారు రూ.477.30 కోట్లు వినియోగిస్తున్నట్లు మంత్రి ప్రకటనలో వెల్లడించారు. ఈ పథకం విధివిధానాల(Scheme Procedures)పై లబ్ధిదారుల్లో ఎవరికైనా అనుమానాలు ఉంటే 1912కు కాల్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని చెప్పారు. గత YCP ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని అంధకారంలోకి నెట్టిందని మంత్రి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం దళిత, గిరిజనుల కోసం అమతలు చేస్తున్న పథకాలు చూసి నిరాశతో YCP తన అనుబంధ మీడియాను అడ్డం పెట్టుకుని తప్పుడు రాతలు రాయిస్తుందని మంత్రి గొట్టిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు.
లబ్ధిదారులు అప్లై చేసుకోవచ్చు
మరోవైపు SC, STలకు ఉచిత విద్యుత్ పథకం(Free electricity scheme) సంబంధించి ఎవరైనా అర్హులు ఉండి, పథకం లబ్ధిని అందుకోలేకపోతే ప్రభుత్వ గైడ్ లైన్స్ పాటించాలని విద్యుత్ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ పథకానికి అర్హులైన వారు కుల ధ్రువీకరణ పత్రం (Cast Certificate) సహా ఇతరత్రా వివరాలతో దగ్గరలోని మీసేవ కేంద్రం, విద్యుత్ కార్యాలయాలను సంప్రదిస్తే పథకం వర్తించే అవకాశాలు ఉన్నాయి.