తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో పాన్ ఇండియా ట్రెండ్ బాగా పెరిగిన తర్వాత, హీరో హీరోయిన్ల రెమ్యునరేషన్(Remuneration) అన్నది ఒక చర్చగా మారింది. ఇటీవల అల్లు అర్జున్(Allu Arjun) తన తర్వాతి సినిమా కోసం 300 కోట్ల వరకూ పారితోషికం డిమాండ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అలాగే తమిళ స్టార్ విజయ్(Vijay) కూడా సినిమాకు 200 కోట్లకు పైగా తీసుకుంటున్నాడు. ఇలాంటి సమయంలో కన్నడ ఇండస్ట్రీకి చెందిన రిషబ్ శెట్టి(Rishib Shetty) ఒకే సినిమాతో తన రెమ్యునరేషన్‌ను ఏకంగా 2 కోట్ల నుంచి 100 కోట్లకు పెంచేశాడు.
2022లో విడుదలైన “కాంతారా”(Kantara) సినిమాతో రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా పాన్ ఇండియా గుర్తింపు పొందాడు. ఈ సినిమాకు ముందు అతని రెమ్యునరేషన్ 2 కోట్లు మాత్రమే. కానీ కాంతారా సినిమాతో వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత, ఇప్పుడు తీస్తున్న “కాంతారా 2″(Kantara2) కోసం అతను ఏకంగా 100 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేశాడని సమాచారం. ఇది ఇండస్ట్రీలో పెద్ద షాక్‌గా మారింది.
View this post on Instagram
తాజా సమాచారం ప్రకారం, కాంతారా 2 సినిమా 2025 అక్టోబర్ 2న విడుదల కానుంది. ఈ సినిమాలో నటనతో పాటు దర్శకత్వం కూడా రిషబ్ శెట్టే నిర్వర్తిస్తున్నాడు. అంతేకాదు, రెమ్యునరేషన్‌తో పాటు, లాభాల్లో వాటా కూడా అడిగాడట. ఈ సినిమా కన్నడ, హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, ఇంగ్లీష్ సహా ఏడు భాషల్లో విడుదల కానుంది.
View this post on Instagram
గతంలో కేవలం రూ.16 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన కాంతారా, ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం రేపింది. ఆ సినిమాతో రిషబ్ శెట్టికి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు కూడా లభించింది. ఇప్పుడు “కాంతారా 2” ఎంతమేర రికార్డులు సృష్టిస్తుందో ఆసక్తికరంగా మారింది.






