తెలుగు బుల్లితెరపై సీరియల్స్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మహిళలు మాత్రం ప్రతిరోజూ తమ ఫేవరెట్ సీరియల్స్‌ను మిస్సవ్వరు. హీరో, హీరోయిన్‌లతో పాటు ఇప్పుడు విలన్ పాత్రలు, సహాయ పాత్రలకు కూడా అభిమానం ఏర్పడుతోంది. అత్త, వదిన, తల్లి పాత్రల్లో నటించే కొంతమంది నటీమణులు ప్రత్యేకమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు.
అందులో జగతి మేడమ్(Jagathi) ఒకరు. బుల్లితెర ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించిన నటి జ్యోతిరాయ్(జగతి మేడమ్). గుప్పెడంత మనసు(Guppedantha Manasu) సీరియల్‌లో హీరో రిషి తల్లిగా, కాలేజీ లెక్చరర్‌గా ఆమె పోషించిన పాత్ర ఎప్పటికి గుర్తుండిపోతుంది. కొడుకు ప్రేమ కోసం ఆరాటపడే తల్లి పాత్రలో ఆమె చూపిన అద్భుతమైన నటన, చీరకట్టులోని హుందాతనం ప్రేక్షకులను కట్టిపడేశాయి. సీరియల్ పాపులారిటీ పీక్‌లో ఉన్న సమయంలోనే ఆమె అనూహ్యంగా షో నుంచి తప్పుకోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఇటీవల ఈ సీరియల్‌కి ఎండ్ కార్డ్ పడినా, జ్యోతిరాయ్(Jyothi Rai) పాత్ర మాత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచింది.
View this post on Instagram
ఇంతకాలం సంప్రదాయబద్ధమైన లుక్స్‌లో కనిపించిన ఆమె, ఇప్పుడు సోషల్ మీడియాలో పూర్తి విభిన్న అవతారం ఎత్తుతున్నారు. గ్లామర్ డ్రెస్సుల్లో( Glamorous Beauty ) ఫోటోషూట్‌లు చేసి, వాటిని షేర్ చేస్తూ నెట్టింట హాట్‌టాపిక్ అవుతున్నారు. హీరోయిన్లకే గట్టి పోటీ ఇస్తూ, ఆధునిక దుస్తుల్లో సెగలు పుట్టించేలా పోజులు ఇస్తున్నారు. ఆమె తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. చీరలో కానీ, మోడ్రన్ లుక్‌లో కానీ, జ్యోతిరాయ్ అందం, ఆకర్షణ ఏ మాత్రం తగ్గలేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
View this post on Instagram






