Mana Enadu: నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna) ఇటు సినీ లైఫ్‌లో, అటు పొలిటికల్ లైఫ్(Political Life)లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే వరుస హిట్లతో ఊపు మీదున్న బాలయ్య తన లేటెస్ట్ మూవీ(Latest Movie)పై ఫోకస్ చేశారు. గతేడాది సంక్రాంతికి వీరసింహారెడ్డి, దసరాకు భగవంత్ కేసరి సినిమాలతో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల అన్‌స్టాపబుల్ సీజన్ 4(Unstoppable Season 4) షోతో అలరిస్తున్నారు.
క్లైమాక్స్‌కు మూవీ షూటింగ్
ఇక ఇదే జోష్‌తో మరో క్రేజీ కాంబోను లైన్‌లో పెట్టారు బాలయ్య. బాబీ దర్శకత్వంలో(Directed by Bobby) బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘NBK 109’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫాస్ట్‌గా సాగుతోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్, ప్రమోషనల్ వీడియో(Poster, Promotional Video)లు భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. షూటింగ్ క్లైమాక్స్ చేరడంతో బాలయ్య ఫ్యాన్స్ ఈ మూవీ అప్డేట్ గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు. దీంతో మూవీ టీమ్ ఓ స్పెషల్ అనౌన్స్ మెంట్(Special announcement) చేసింది. ఈ దీపావళి(Diwali)కి ఫ్యాన్స్‌కు ఓ సర్‌ప్రైజ్ ఇచ్చిందుకు రెడీ అయింది. దీపావళి రోజు మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్(First look along with movie title) రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది. దీంతో ఫ్యాన్స్ ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు.
#NBK109
చిత్రం పేరు *సర్కార్ సీతారామ్* గా దాదాపు ఖరారు….😎
ఈనెల 30 సాయంత్రం టైటిల్ టీజర్ రిలీజ్ ప్రకటన చేసే అవకాశం
మొదట డాకూమహరాజ్ అని అనుకున్నా చివరకు సర్కార్ సీతారామ్ టైటిల్ కే మొగ్గు చూపిన చిత్రబృందం pic.twitter.com/AzziGV67nz— 🚲🇻🇪🇳🇰🇦🇹 𝒦𝓊𝒸𝒽𝒾𝓅𝓊𝒹𝒾 🚲 (@VenkatKuchipud4) October 28, 2024
బాలయ్య గెటప్‌కు సెట్ అయ్యేలా టైటిల్
ఇదిలా ఉండగా బాలయ్య నెక్ట్స్ మూవీ టైటిల్‌పై ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. స్టోరీ, బాలయ్య గెటప్‌కు సెట్ అయ్యేలా ఈ మూవీకి ‘సర్కార్ సీతారాం(Sarkar Sitaram)’ అనే టైటిల్ ఫిక్స్ చేశారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అటు మూవీ టీమ్ సైతం ఇదే టైటిల్‌ను అధికారికంగా ప్రకటించనున్నట్లు టీటౌన్‌లో టాక్ వినిపిస్తోంది. కాగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాబీ డియోల్(Bobby Deol) విలన్‌గా కనిపించనుండగా.. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా(Urvashi Rautela), తెలుగమ్మాయి చాందినీ చౌదరి ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.






