ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్(ICC Test Rankings)లో టీమ్ఇండియా(Team India) ప్లేయర్లు దూసుకొచ్చారు. అలాగే భారత్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 158 పరుగులతో రాణించిన ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు హ్యారీ బ్రూక్(Harry Brook) సైతం ర్యాంకింగ్స్‌లో పైకి ఎగబాకాడు. ICC తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో బ్రూక్ ఫస్ట్ ప్లేస్‌కి చేరుకున్నాడు. గత కొంతకాలంగా అగ్రస్థానంలో కొనసాగుతున్న ఇంగ్లండ్ సీనియర్ ప్లేయర్ జో రూట్(Joa Root) రెండో స్థానానికి పడిపోయాడు. వీరిద్దరి మధ్య 18 రేటింగ్ పాయింట్ల తేడా ఉంది. కాగా ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ(269), రెండో ఇన్నింగ్స్‌లో భారీ శతకం (161) సాధించిన టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubhman Gill) ఏకంగా 15 స్థానాలు మెరుగుపరచుకుని తన కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్ ఆరో స్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్(Kane Williamson) మూడు, యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal) నాలుగో స్థానంలో, స్టీవ్ స్మిత్(Steve Smith) ఐదో స్థానంలో ఉన్నారు.
టెస్టుల్లో టాప్-5లో ఉన్న జట్లు ఇవే..
☛ ఆస్ట్రేలియా 123 రేటింగ్ పాయింట్స్
☛ సౌతాఫ్రికా 115 రేటింగ్ పాయింట్స్
☛ ఇంగ్లండ్ 113 రేటింగ్ పాయింట్స్
☛ ఇండియా 105 రేటింగ్ పాయింట్స్
☛ న్యూజిలాండ్ 95 రేటింగ్ పాయింట్స్

టెస్టుల్లో టాప్-5లో ఉన్న బ్యాటర్లు వీరే..
➧ హ్యారీ బ్రూక్ (England) – 886 రేటింగ్ పాయింట్లు
➧ జోరూట్ (England) – 868 రేటింగ్ పాయింట్లు
➧ కేన్ విలియమ్సన్ (New Zealand) – 867 రేటింగ్ పాయింట్లు
➧ యశస్వి జైస్వాల్ (India – 858 రేటింగ్ పాయింట్లు
➧ స్టీవ్ స్మిత్ (Australia) – 813 రేటింగ్ పాయింట్లు
టెస్టుల్లో టాప్-5లో ఉన్న బౌలర్లు వీరే..
✦ జస్‌ప్రీత్ బుమ్రా (India) – 898 రేటింగ్ పాయింట్లు
✦ కగిసో రబాడ (South Africa) – 851 రేటింగ్ పాయింట్లు
✦ పాట్ కమిన్స్ (Australia) – 840 రేటింగ్ పాయింట్లు
✦ జోష్ హేజిల్‌వుడ్ (Australia) – 817 రేటింగ్ పాయింట్లు
✦ నోమన్ అలీ (Pakistan) – 806 రేటింగ్ పాయింట్లు
𝑰𝒏𝒅𝒊𝒂’𝒔 𝒚𝒐𝒖𝒏𝒈 𝒈𝒖𝒏𝒔 𝒂𝒓𝒆 𝒐𝒏 𝒇𝒊𝒓𝒆! 🔥🇮🇳
Yashasvi Jaiswal, Shubman Gill, and Rishabh Pant are climbing high in the latest ICC Test rankings! 🏏📈#YashasviJaiswal #ShubmanGill #RishabhPant #ICCTestRankings #TeamIndia #YoungGuns #IndianCricket #RisingStars… pic.twitter.com/lmxhUw39Li
— Cricdiction (@cricdiction) July 9, 2025






