బంగారం (Gold) అంటే మగువలకు కాస్త మక్కువ ఎక్కువే. అందుకే శుభకార్యాలకు తప్పకుండా బంగారు ఆభరణాలు ధరిస్తుంటారు. ఇక వారు కూడబెట్టిన డబ్బు కూడా పసిడి కొనేందుకే ఉపయోగిస్తుంటారు. పుత్తడి ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ఎప్పటికప్పుడు నగదు పొదుపు చేస్తుంటారు కూడా. రకరకాల డిజైన్లలో ఉన్న ఆభరణాలు అలంకరించుకోవడం అంటే మహిళలకు ఎంతో ఇష్టం. అందుకే బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.
భారత్ లో బంగారానికి భారీ డిమాండ్
ఇక స్తోమతకు తగ్గినట్లుగా ప్రజలు బంగారం కొనుగోలు చేస్తుంటారు. భారతదేశంలో పసిడికి డిమాండ్ ఎక్కువ. అందుకే ప్రతి ఏటా టన్నుల కొద్ది బంగారం దిగుమతి అవుతుంటుంది. ప్రపంచంలో బంగారం దిగుమతి (Gold Import) చేసుకుంటున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉందంటే ఇక్కడ పసిడికి ఉన్న డిమాండ్ ఎంతో అర్థం చేసుకోవచ్చు. అయితే గత కొన్నిరోజులుగా మార్కెట్లో పుత్తడి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. చాలా రోజుల నుంచి బంగారం రేట్లు రూ.85,000 కుపైగా ఉంటున్నాయి.
ట్రంప్ నిర్ణయాలతో మార్కెట్లు కుదేల్
బంగారంతో పాటు వెండి ధరలు కూడా అమాంతం పెరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బాధ్యతలు చేపట్టిన తర్వాత వీటి రేట్లు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రతీకార సుంకాలు అంటూ ట్రంప్ సృష్టించిన అనిశ్చితి వల్ల మార్కెట్లు కుదేలైపోతున్నాయి. ట్రంప్ నిర్ణయాలతో అంతర్జాతీయ వాణిజ్య అనిశ్చితి నెలకొంటుంది. దీని వల్ల బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. మరి ఇవాళ ( మార్చి 6వ తేదీ) హైదరాబాద్ మహానగరంలో గోల్డ్ ధరలు (Gold Price Today) ఎలా ఉన్నాయో చూద్దామా..?
హైదరాబాద్ లో బంగారం ధరలు
హైదరాబాద్మార్కెట్లో బంగారం ధర (Gold Rates) వరుసగా రెండో రోజూ పెరిగింది. ఈరోజు 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు ఏకంగా రూ. 600 పెరిగి రూ. 87, 980 వద్దకు చేరింది. 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములపై రూ. 550 పెరిగి రూ. 80, 650 వద్ద అమ్ముడుపోతోంది. మరోవైపు వెండి ధరలు (Silver Price Today) మాత్రం నేడు స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ. 1,07,000 మార్క్ వద్ద పలుకుతోంది.






