
బంగారం, వెండి ధరలు (Silver Price Today) రోజురోజుకు అకాశాన్నంటుతున్నాయి, డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు, అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి వల్ల చాలా మంది ఇన్వెస్టర్లు పసిడిని పెట్టుబడి సాధనంగా చూస్తున్నారు. ఆర్థిక మాంద్యం భయాలతో చాలా దేశాల బ్యాంకులు ముందస్తుగా భారీ గోల్డ్ ను కొనుగోలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా పుత్తడి రేట్లకు రెక్కలు వచ్చాయి. దీంతో సామాన్యులు బంగారాన్ని కొనుగోలు చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి.
పెరిగిన పసిడి ధరలు
బంగారాన్ని సంప్రదాయంలో భాగంగా భావించే భారతదేశంలో ధరలు పెరగడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఏ శుభకార్యానికైనా మగువలు బంగారు ఆభరణాలు ధరించే వెళ్తుంటారు. ఇక ఇది మన దేశంలో అత్యంత సురక్షితమైన పెట్టుబడి సాధనంగా కూడా భావిస్తుంటారు. అందుకే గోల్డ్ (Gold Rates Today) కొనుగోలు చేసేందుకు ఎక్కువ మక్కువ చూపిస్తుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పసిడి కొనుగోలు చేసేలా ధరలు లేవని భారతీయులు ఆందోళన చెందుతున్నారు.
పసిడి బాటలోనే వెండి
గోల్డ్ రేట్లు రోజురోజుకు పెరుగుతున్నందున సామాన్యులు పుత్తడిని కొనుగోలు చేయలేకపోతున్నారు. రెండ్రోజుల నుంచి ధరలు స్థిరంగా ఉన్నా.. ఇవాళ స్వల్పంగా గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం తులం ధర ఆదివారం రోజున రూ.95,670 ఉండగా.. సోమవారం నాటికి రూ.160 తగ్గి రూ.95,510 వద్ద పలుకుతోంది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు ఆదివారం రోజు రూ.87,700 ఉండగా.. రూ.150 తగ్గి సోమవారం నాటికి రూ.87,550 పలుకుతోంది. ఇక కేజీ సిల్వర్ రేటు (Silver Price Today) ఆదివారం రోజున రూ.1,10,000 ఉండగా రూ.100 తగ్గి సోమవారం నాడు రూ.1,09,900 వద్ద విక్రయిస్తున్నారు.