
పసిడి ప్రియులకు మరోసారి షాక్ తగిలింది. మొన్నటిదాక ఆకాశాన్నంటిన బంగారం ధరలు (Gold Price Today) నిన్న కాస్త నెమ్మదించాయని అనుకునేలోగానే మళ్లీ షాక్ ఇచ్చాయి. తాజాగా మరోసారి పుత్తడి రేట్లు భారీగా పెరిగాయి. దేశవ్యాప్తంగా పెరిగిన గోల్డ్ రేట్లతో సామాన్యులు కొనాలంటే భయపడుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తుండటంతో ఈ సమయంలో పసిడి ధరలు పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఇలా అయితే గోల్డ్ కొనుగోలు చేయడమెలా అని వాపోతున్నారు.
మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు
దేశవ్యాప్తంగా శనివారం రోజున మరోసారి పసిడి ధరలు పెరిగాయి. దేశీయంగా బంగారం రేట్లు (Gold Rates Today) మరోసారి ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని చేరాయి. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్స్ పసిడి ధర ఒక్కరోజులోనే రూ. 200 పెరిగి తులం పుత్తడి రూ. 83,600 వద్ద పలుకుతోంది. మరోవైపు 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై రూ.200 పెరిగి రూ.91,200 వద్ద విక్రయిస్తున్నారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ.83,550 పలుకుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములు రూ. 91,130 వద్ద విక్రయిస్తున్నారు.
పసిడితో పోటీ పడుతున్న వెండి
మరోవైపు వెండి ధరలు (Silver Price Today) కూడా బంగారంతో పోటీ పడుతూ విపరీతంగా పెరుగుతున్నాయి. వెండి ధరలు కూడా ఆల్ టైమ్ గరిష్టాల్ని నమోదు చేశాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 3000 వేలు పెరిగి ప్రస్తుతం రూ. 1.05 లక్షల వద్ద పలుకుతోంది. హైదరాబాద్ నగరంలోనూ ఒక్కరోజులోనే రూ. 3 వేలు పెరగడంతో ఇప్పుడు కిలో వెండి ధర రూ. 1.14 లక్షల వద్ద విక్రయిస్తున్నారు. ఇలా బంగారం, వెండి ధరలు భారీగా పెరగడంతో సామాన్యులు వాటిని విక్రయించాలంటే భయపడుతున్నారు.