బంగారం (Gold Price Today), భారతీయ మహిళలది అవినాభావ సంబంధం. ఏ పేరంటానికి వెళ్లినా మెడలో పసిడి ఆభరణాలు ఉండాల్సిందే. అయితే పుత్తడి కేవలం ఆభరణంగానే కాకుండా పెట్టుబడి సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. అయితే గత కొంతకాలంగా బంగారం రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీసుకుంటున్న నిర్ణయాలు, సుంకాల పెంపుతో అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి నెలకొంటుంది. ఫలితంగా పుత్తడి రేట్లు పెరుగుతున్నాయి.
దిగొచ్చిన బంగారం ధర
అయితే మొన్నటి దాకా రూ.90వేలు దాటిన పసిడి ధరలు (Gold Rates Today) రెండ్రోజులుగా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గరిష్ట స్థాయిల వద్ద ప్రాఫిట్ బుకింగ్‌కు తోడు.. ట్రంప్ సుంకం భయాలు నెమ్మదించడం వంటి కారణాలతో పుత్తడి రేట్లు కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నాయి. మొన్నటిదాక రూ.90వేలకుపైగా పలికిన 10 గ్రాముల బంగారం ధర ఇప్పుడు దిగొచ్చింది. హైదరాబాద్ లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.89,520 పలుకుతోంది. దేశవ్యాప్తంగా బంగారం రేట్లు స్వల్పంగా తగ్గుముఖం పట్టడంతో సామాన్యులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
స్థిరంగా వెండి ధరలు
హైదరాబాద్ నగరంలో తాజాగా బంగారం ధర రూ. 150 తగ్గింది. 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై రూ. 160 తగ్గి రూ. 89,620 వద్ద పలుకుతోంది. 22 క్యారెట్స్ బంగారం 10 గ్రాముల రూ. 82,150 వద్ద అమ్ముడుపోతోంది. ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.89,770.. 22 క్యారెట్ల బంగారం రేటు రూ.82,300 వద్ద ఉంది. ఇక వెండి ధరలు (Silver Price Today) మాత్రం స్థిరంగానే ఉన్నాయి. ఢిల్లీలో కేజీకి రూ. 1.01 లక్షలు పలుకుతుండగా.. హైదరాబాద్ నగరంలో రూ. 1.10 లక్షల వద్ద పలుకుతోంది.







