అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అధికారం చేపట్టినప్పటి నుంచి అంతర్జాతీయ మార్కెట్లు వణికిపోతున్నాయి. ట్రంప్ టారిఫ్స్ పెంపు, అమలు ప్రకటనలతో పలుదేశాల వాణిజ్యం అస్తవ్యస్తమవుతోంది. భారత్ సహా వివిధ దేశాలపై ప్రకటించిన ప్రతీకార సుంకాల అమలుపైనా తాజాగా ట్రంప్ చేసిన ప్రకటనతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. ఈ నేపథ్యంలో మార్చి 5వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో రేట్ల గురించి తెలుసుకుందాం.
నేటి బంగారం ధరలు
దేశంలో బంగారం (Gold Price Today), వెండి ధరలు మళ్లీ పెరిగాయి. రోజురోజుకు పెరుగుతున్న ధరలు సామాన్య గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. శుభకార్యాలకు పసిడి ఆభరణాలు కొనాలంటే జంకే పరిస్థితులు ఉన్నాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.600మేర పెరిగి బుధవారం రోజున రూ.87 వేల 980 స్థాయికి ఎగబాకింది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు 10 గ్రాములపై రూ.550 పెరగి రూ. 80 వేల 650 వద్దకు చేరింది.
వెండి ధరల్లో పెరుగుదల
మరోవైపు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారంతో పాటుగా వెండి ధరలు (Silver Price Today) కూడా భారీగా పెరిగాయి. మార్చి 4వ తేదీ వరకు వరుసగా తగ్గడం లేదా స్థిరంగా కొనసాగుతూ వచ్చిన వెండి ధరలు ఇవాళ భారీగా పెరిగింది. కిలోపై ఒక్కసారిగా రూ.2000 పెరిగి కిలో వెండి ధర రూ. 1,07,000 వద్దకు చేరింది.






