
తెలుగు రాష్ట్రాల్లో బంగారం(Gold), వెండి(Silver) ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ట్రంప్(Trump) ప్రకటించిన 35% టారిఫ్(Tariffs)లు, రూపాయి విలువ బలహీనత, ఇన్ఫ్లేషన్ భయాలు ఈ ధరల పెరుగుదలకు కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు స్థానిక డిమాండ్(Demand)తో పాటు అంతర్జాతీయ ధోరణులను అనుసరిస్తున్నాయి. ఈ ధరల పెరుగుదల ఆషాఢం సీజన్‌లో కొనుగోలుదారులకు ఆందోళన కలిగిస్తోంది. నిపుణులు ‘బై ఆన్ డిప్స్’ వ్యూహాన్ని సూచిస్తున్నారు, ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇక శనివారం (జులై 128) హైదరాబాద్ బులియన్ మార్కెట్(Hyderabad Bullion Market)లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర (Gold Rate Today) 10 గ్రాముల పసడి రేటు రూ.710 పెరిగి రూ.99,710 వద్ద ట్రేడవుతోంది. అటు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.650 తగ్గి ప్రస్తుతం రూ.91,400 వద్ద కొనసాగుతోంది. అటు ఏపీలోని విజయవాడ(Vijayawada), విశాఖపట్నం(Vizag)లోనూ దాదాపు ఇవే ధరలు అమలులో ఉన్నాయి. మరోవైపు వెండి ధరలు (Silver Rate Today) ఇవాళ భారీగా పెరిగాయి. నిన్న కిలో వెండి ధర రూ.1,21,000 ఉండగా, ఈరోజు రూ.4,000 పెరిగి రూ.1,25,000కు చేరుకుంది. ఇక అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ(Rupee Value) రూ.85.84గా నమోదైంది.