Today Market: 10గ్రా. గోల్డ్ రేట్ ₹84,040.. కిలో వెండి ప్రైస్ ₹1,06,900

బంగారం(Gold) కొనుగోలు చేయాలనుకునే వారికి రోజురోజుకీ పెరుగుతున్న ధరలు(Rates) చెమటలు పట్టిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో(International market) నెలకొన్న అనిశ్చితి, రూపాయి విలువ క్షీణించడం(Depreciation of rupee) వంటి కారణాలతో పుత్తడి ధరల పరుగు కొనసాగుతోంది. నిన్న ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (99.9 స్వచ్ఛత) బంగారం ధర రూ.400 పెరిగి రూ.85,300కు ఎగబాకింది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం(Pure Gold) ధర కూడా రూ. 400 పెరిగి రూ. 84,900కు చేరుకుంది. మరోవైపు, వెండి(Silver) ధర కూడా కిలోకు రూ.300 లాభపడి రూ. 96 వేలకు చేరుకుంది. ఇక ఈరోజు (ఫిబ్రవరి 4)న తెలుగు రాష్ట్రాల్లో(Telugu States)నూ దాదాపు నిన్నటి ధరలే కొనసాగుతున్నాయి.

రూపీ విలువ మరింత పతనం

కెనడా(Canada), మెక్సికో, చైనా(Chaina)పై అమెరికా టారిఫ్(USA Tariff) విధింపు మన రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపింది. అమెరికా చర్యలు వాణిజ్య యుద్ధానికి దారితీసిన నేపథ్యంలో అమెరికా డాలరు(US Dollar)తో పోలిస్తే రూపాయి విలువ(Rupee Value) 49 పైసలు క్షీణించింది. ఫలితంగా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 87.11గా నమోదైంది. అమెరికా డాలరు బలంగా ఉండటం, విదేశీ పెట్టుబడులు(Foreign investments) తరలిపోతుండటం వంటి అంశాల కారణంగా రూపాయి బలహీనంగా ట్రేడయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈరోజు (FEB 4th) బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

* 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.7,7050
* 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 84,040
* కేజీ వెండి ధర రూ. 1,06,900గా ట్రేడ్ అవుతోంది.
కాగా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉండనుండగా.. పలు ప్రాంతాల్లో కాస్త అటుఇటూగా ధరల్లో తేడాలు ఉండొచ్చు.

Related Posts

Stocks: ఎంపిక చేసుకున్న షేర్లలోనే ట్రేడింగ్ కీలకం!

దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) ఈ వారం మిశ్రమంగా చలించొచ్చు. సెప్టెంబర్లో యూఎస్ ఫెడ్ వడ్డీరేట్లు తగ్గించే అవకాశం ఉండటం, కంపెనీల ఫలితాలు, GST సంస్కరణలు సూచీలకు ఊతమిస్తున్నాయి. ట్రంప్ టారిఫ్స్(Trump Tarrifs), రష్యా-ఉక్రెయిన్ యుద్ధ వివరణపై స్పష్టత లేకపోవడం, మారుతున్న…

హీరో విడా VX2 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. ఫీచర్లు అదుర్స్! ధర ఎంతంటే..?

హీరో ఎలక్ట్రిక్ సబ్సిడరీ(Hero Electric Sabsidari) అయిన విడా(Vida VX2) సంస్థ తాజాగా తన కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ VX2(Famely Electric Schooter)ను మార్కెట్‌లోకి విడుదల(Lanched) చేసింది. ఈ స్కూటర్‌ను రెండు వేరియంట్లలో అందిస్తున్నారు – Go మరియు Plus.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *