బంగారం ధరలు(Gold Price) మళ్లీ పెరుగుతున్నాయి. గత వారంలో వరుసగా మూడు రోజులు తగ్గిన పసిడి శుక్రవారం ఒక్కరోజే రూ.1200కి పెరిగి షాకిచ్చింది. ఇక శని, ఆదివారాల్లో స్థిరంగా ఉన్న పుత్తడి ఇవాళ (మే 19) స్వల్పంగా పెరిగాయి. అటు సిల్వర్ ధరలు(Silver Rates) మాత్రం కాస్త శాంతించాయి.
ఇవాళ రేట్లు ఎలా ఉన్నాయంటే..
ఇక హైదరాబాద్(Hyderabad)లో ఇవాళ రేట్లు ఎలా ఉన్నాయంటే.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.380 పెరిగి రూ.95,510కు చేరింది. ఇక 22 క్యారెట్ల పుత్తడి 10గ్రాములకు రూ.350 పెరిగి రూ.87,550 వద్ద కొనసాగుతోంది. అటు కేజీ వెండిపై రూ.100 తగ్గి రూ.1,07,900గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి. ఇక రూపాయి విలువ(Rupee Value) ఈరోజు ఒక అమెరికన్ డాలర్(US Dollar)కు రూ.85.60గా ఉంది.






