నిన్న కాస్త తగ్గిన బంగారం ధరలు(Gold Rates) ఇవాళ మళ్లీ షాకిచ్చాయి. దీంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం (మే 30) హైదరాబాద్ బులియన్ మార్కెట్లో రేట్లు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.270 పెరిగి రూ.97,310కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ.250 పెరిగి రూ.88,200 వద్ద కొనసాగుతోంది. అటు కేజీ సిల్వర్(Silver) ధరలో ఎలాంటి మార్పులు లేకుండా రూ.1,10,900 వద్ద ట్రేడ్ అవుతోంది.
ఇక ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) ఒడిదుడుకుల మధ్య ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 221 పాయింట్ల నష్టంతో 81,408 వద్ద, నిఫ్టీ 69.4 పాయింట్ల నష్టంతో 24,764 వద్ద కొనసాగుతోంది.






