
బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతూ కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న యుద్ధ పరిస్థితులు పుత్తడి ధరల పెరుగులదలకు ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్ వార్, అమెరికా టారిఫ్స్, రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం తదితరాల ప్రభావం గోల్డ్‌పై పడుతోందని తెలిపారు. పరిస్థితులు ఇలానే కొనసాగితే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే పసడి రేట్లు లక్ష మార్కును చేరిన క్రమంలో తాజా హెచ్చరికలు బంగారం కొనుగోలుదారులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. కేవలం ధరించేవారే కాకుండా, ఇన్వెస్ట్ మెంట్ చేసే వారు కూడా రోజురోజుకు పెరుగుతున్న ధరలతో షాకవుతున్నారు.
ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..
ఇక వరుసగా రెండో రోజు బంగారం ధరలు పెరిగాయి. ఇవాళ (జూన్ 19) హైదరాబాద్, విజయవాడలోని ప్రధాన మార్కెట్లలో పుత్తడి రేట్లు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.170 పెరిగి రూ.1,01,080కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాములకు రూ.150 పెరిగి రూ.92,650 వద్ద కొనసాగుతోంది. అటు కేజీ సిల్వర్(Silver)పై రూ.1000 పెరిగి రూ.1,22,000గా ఉంది. దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) నష్టాల్లో ట్రేడింగ్ మొదలుపెట్టి ప్రస్తుతం స్వల్ప లాభాల్లో పయనిస్తున్నాయి. ఉదయం 9.56 గంటల సమయంలో సెన్సెక్స్ 18 పాయింట్ల లాభంతో పతనమై 81,450 వద్ద, నిఫ్టీ 5 పాయింట్ల వృద్ధితో 24,830 వద్ద ట్రేడవుతున్నాయి.