
గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్. వరుసగా మూడో రోజు బంగారం ధరలు(Gold Rates) తగ్గాయి. స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. నేడు కూడా ఓ స్థాయిలో దిగొచ్చింది. నిన్న(జులై 25) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.450 తగ్గగా.. ఈరోజు(జులై 26) రూ.500 తగ్గింది. మరోవైపు 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై వరుసగా రూ.490, రూ.550 తగ్గింది. బులియన్ మార్కెట్(Bullion market)లో శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,600గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.99,930గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్(Hyederabad, విశాఖపట్నం, విజయవాడల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి. అయితే ప్రాంతాల వారీగా పసిడి ధరల్లో మార్పులు ఉంటాయన్న విషయం తెలిసిందే.
రూ.2000 తగ్గిన వెండి ధర
మరోవైపు వెండి ధర కూడా బంగారం బాటలోనే నడిచింది. వరుసగా మూడు రోజులుగా స్థిరంగా ఉన్న వెండి.. నేడు భారీగా తగ్గింది. ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.2000 తగ్గి.. రూ.1,26,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ఒక లక్షా 19 వేలుగా నమోదైంది. దేశంలోని ప్రధాన నాగరాలైన ముంబై, ఢిల్లీ, బెంగళూరులో కిలో వెండి ఒక లక్షా 9 వేలుగా కొనసాగుతోంది.